బాబూ..! వాలంటీర్లు నీ బుట్టలో పడరు

పెన్షన్ల విషయంలో వాలంటీర్లను కించపరచడంతోపాటు, వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెట్టిన చంద్రబాబు.. ప్రజల్లో తిరుగుబాటు రావడంతో యూటర్న్ తీసుకున్నారని అన్నారు పేర్ని నాని.

Advertisement
Update:2024-04-09 18:59 IST

వికలాంగులకు రూ.6వేలు పెన్షన్..

వాలంటీర్లకు రూ.10వేలు గౌరవ వేతనం..

అంటూ చంద్రబాబు కోతలు కోస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజలు ఆయన మాయ మాటలు నమ్ముతారా..? వికలాంగులు బాబు జిమ్మిక్కులు నమ్మి ఓటేస్తారా..? వాలంటీర్లు చంద్రబాబు బుట్టలో పడతారా..? అనేది ప్రశ్నార్థకం. వాళ్లెవరూ బాబు మాయమాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్న చంద్రబాబు నేడు వారిపై కల్లబొల్లి ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు.

పెన్షన్ల విషయంలో వాలంటీర్లను కించపరచడంతోపాటు, వృద్ధులు, వికలాంగులను ఇబ్బంది పెట్టిన చంద్రబాబు.. ప్రజల్లో తిరుగుబాటు రావడంతో యూటర్న్ తీసుకున్నారని అన్నారు పేర్ని నాని. సేవ కోసం పని చేసే వాలంటీర్లు, చంద్రబాబు గేలానికి పడరని చెప్పారు. వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ.. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. మూడు పదులు నిండని వాలంటీర్లపై.. చంద్రబాబు అండ్ కో చాలా దారుణంగా మాట్లాడారని ఆరోపించారు. మోసపు వాగ్దానాలతో ప్రజల్ని వంచించడం, అవసరం తీరాక ఆ హామీలను అటకెక్కించడం ఆయనకు అలవాటేనన్నారు పేర్ని నాని.

బూటకపు మాటలు, నయవంచనకు ప్రతిరూపం చంద్రబాబు అని అన్నారు పేర్ని నాని. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని హామీలిచ్చే అవకాశం ఉందన్నారు. ఆ హామీలను ప్రజలు నమ్మే రోజులు పోయాయని, చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదన్నారు. వాలంటీర్లు జీతంకోసం పనిచేయడంలేదని, సేవా దృక్పథంతో పనిచేసే విద్యావంతులు వాలంటీర్లు అని అన్నారు నాని. జీతాల పెంపుతో వారిని కొనాలని ప్రయత్నించడం చంద్రబాబు మూర్ఖత్వం అన్నారు. 

Tags:    
Advertisement

Similar News