నేనే వాలంటీర్.. పెన్షన్ పంపిణీ చేసిన సీఎం

మంగళగిరి నియోజకవర్గం పెనమాకలో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు.

Advertisement
Update: 2024-07-01 01:39 GMT

ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇస్తారని ఎదురు చూస్తుంటారు వృద్ధులు. ఈసారి కూడా ఇంటి వద్దకే పెన్షన్ వచ్చింది, కానీ తెచ్చింది మాత్రం సీఎం చంద్రబాబు. మంగళగిరి నియోజకవర్గం పెనమాకలో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. పూరిపాకలో నివాసం ఉంటున్న ఆ కుటుంబం యోగక్షేమాలు కనుక్కున్నారు. నేరుగా ముఖ్యమంత్రే ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.


చంద్రబాబు మార్కు..

గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమం లేదు. జగన్ హయాంలో వాలంటీర్ వ్యవస్థతో ఈ పద్ధతి మొదలైంది. దీన్ని తనదైన శైలిలో మళ్లీ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఆయనే తొలి పెన్షన్ ను లాంఛనంగా పంపిణీ చేశారు. ఇక జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాలంటీర్లు లేకపోయినా.. సచివాలయ సిబ్బందితో పెన్షన్ పంపిణీ పూర్తి చేసి చూపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వీలైతే తొలిరోజే పెన్షన్ల పంపిణీ నూటికి నూరుశాతం పూర్తి చేయాలని, కుదరకపోతే రెండో రోజుతో పెన్షన్ల పంపిణీ పూర్తి కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మందికి పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టాఫ్ సరిపోకపోతే కొన్నిచోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి పెన్షన్ల పంపిణీకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేసింది. గతంలోలాగే ఇంటివద్దకే వచ్చి పెన్షన్ల పంపిణీ చేపట్టారు. కానీ ఒక్కటే తేడా.. అప్పుడు ఇచ్చింది వాలంటీర్లు, ఇప్పుడు పంపిణీ చేస్తోంది సచివాలయ ఉద్యోగులు. 

Tags:    
Advertisement

Similar News