పవన్ కు మళ్లీ జ్వరం.. యలమంచిలి టూర్ రద్దు

పవన్ కల్యాణ్ పర్యటన రద్దు కావడం ఇది రెండోసారి. అనకాపల్లి యాత్ర పూర్తయింది అనుకుంటున్న సమయంలో ఆయనకు జ్వరం రావడంతో యలమంచిలి టూర్ రద్దయింది.

Advertisement
Update:2024-04-08 11:46 IST

పవన్ కల్యాణ్ కి మళ్లీ జ్వరం వచ్చింది. అనకాపల్లి పర్యటన తర్వాత ఆయనకు నిన్న రాత్రి తిరిగి జ్వరం రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఈరోజు జరగాల్సిన యలమంచిలి పర్యటన రద్దు చేసుకుని పవన్ రెస్ట్ తీసుకుంటున్నారు. పవన్ కి మళ్లీ జ్వరం అని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ తరపున పవన్ ప్రచారానికి వస్తారని ఎదురు చూస్తున్న నేతలు నిరాశకు గురయ్యారు.

పవన్ కల్యాణ్ పర్యటన రద్దు కావడం ఇది రెండోసారి. గతంలో పిఠాపురం నుంచి వారాహి విజయభేరి యాత్ర మొదలు పెట్టిన పవన్ జ్వరం కారణంగా రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ షెడ్యూల్ లో మార్పులు చేసి, ఉత్తరాంధ్ర నుంచి యాత్ర మొదలు పెట్టారు. అనకాపల్లి, ఆ తర్వాత యలమంచిలి, పిఠాపురంలో ఉగాది వేడుకలు.. ఇలా కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఈసారి ఒక్కరోజులోనే ఆయన తిరిగి డీలా పడ్డారు. అనకాపల్లి యాత్ర పూర్తయింది అనుకుంటున్న సమయంలో ఆయనకు జ్వరం రావడంతో యలమంచిలి టూర్ రద్దయింది.

సోషల్ మీడియాలో సెటైర్లు..

పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని, ఆయన జనంలో తిరగలేరని వైసీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. మూడు రోజుల టూర్, ఐదు రోజుల బెడ్ రెస్ట్ అంటూ మంత్రి అంబటి రాంబాబు పవన్ కి ఓ రేంజ్ లో కౌంటర్లిస్తున్నారు. వారు అన్నట్టుగానే పవన్ పదే పదే అనారోగ్యానికి గురికావడం విశేషం. సాయంత్రం వేళ పవన్ తన పర్యటన మొదలు పెడుతున్నా.. ఎండ బెట్టను ఆయన తట్టుకోలేకపోతున్నారు. తనకు జ్వరం అంటూ వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై అనకాపల్లి సభలో పవన్ స్పందించారు. ప్రజల అభిమానం ఉన్నంత వరకు తనకు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. అంతలోనే ఆయనకు మళ్లీ అస్వస్థత కలగడం, టూర్ రద్దు కావడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News