భీమవరం వదిలేశారు.. మరి పవన్ ప్రయాణం ఎటు..?
మొన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు (అంజిబాబు)ను రెండు రోజుల కిందటే జనసేనలో చేర్చుకున్నారు.
అనుకున్నట్లే అయింది.. భీమవరంలో పోటీ చేస్తే మళ్లీ ఓడిపోతాననే భయం జనసేనాని పవన్ కళ్యాణ్‌ను వెంటాడింది. చివరికి పవన్ పట్టుదలపై ఆయన భయమే గెలిచింది. ప్రజాదరణ ఉన్న గ్రంధి శ్రీనివాస్ లాంటి నాయకుణ్ని కాదని భీమవరంలో గెలవడం కష్టమని తేలడంతో పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గం నుంచి పారిపోయారు.
అంజిబాబుకు అభ్యర్థిత్వం
మొన్నటి వరకు టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు (అంజిబాబు)ను రెండు రోజుల కిందటే జనసేనలో చేర్చుకున్నారు. భీమవరంలో ఆయన్ను అభ్యర్థిగా నిలబెట్టాలనే పార్టీలో జాయిన్ చేసుకున్నట్లు తెలిసింది. అదే ఇప్పుడు నిజమైంది. భీమవరం అభ్యర్థిగా పవన్ అంజిబాబునే ఖరారు చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడైన అంజిబాబుకు భీమవరంలో మంచి పేరే ఉంది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై గెలవగలరా అనేది సందేహమే.
పిఠాపురమా? కాకినాడ లోక్‌సభా?
భీమవరంలో గెలవలేనని డిసైడయిన పవన్ దాన్ని విజయవంతంగా వదిలించుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన ప్రయాణం ఎటు? కాపుల ఓట్లు భారీగా ఉన్న పిఠాపురంలో అయితే గెలవచ్చంటున్న నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి దక్కొచ్చన్న ఊహాగానాల మధ్య కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యే, ఎంపీగా రెండుచోట్లా పోటీ చేస్తారా అనేది తేలాలి.