పవన్ మాటే శాసనమా..? అంత సీనుందా..?

అప్పటి నుంచి జగన్ అంటే పవన్ కు బాగా మండుతోంది. మళ్ళీ ఇంతకాలానికి అప్పటి ఛాలెంజ్‌నే మళ్ళీ పవన్ రిపీట్ చేశారు. అప్పటికి, ఇప్పటికీ జగన్ బలహీనపడ్డారా లేకపోతే పవన్ బలం పెరిగిందా..? అన్నదే అర్థం కావటంలేదు.

Advertisement
Update:2022-12-19 11:04 IST

అదేదో సినిమాలో నా మాటే శాసనం అంటూ ఒక క్యారెక్టర్ గట్టిగా అరచి డైలాగులు చెబుతుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాట కూడా అలాగే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎట్టి పరిస్ధితుల్లోనూ అధికారంలోకి రానీయను అంటూ సత్తెనపల్లిలో ఛాలెంజ్ చేశారు. అప్పటికీ తాను ఛాలెంజ్ చేసేయగానే జనాలంతా వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేస్తారని పవన్ అనుకుంటున్నట్లున్నారు. నిజంగానే తనకంత సీన్ ఉందా అని పవన్ ఒక్కరోజు కూడా విశ్లేషించుకున్నట్లు లేరు.

ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చెప్పారు. 'వైసీపీని గెలవనివ్వను.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలాగవుతాడో చూస్తాను' అంటూ రోడ్డు షోలు, ప్రెస్‌మీట్ల‌లో ఛాలెంజ్‌లు చేశారు. తర్వాత ఏమైంది..? 151 సీట్ల అఖండ విజయంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది, జగన్ ముఖ్యమంత్రి అయిపోయారు. ఇదంతా కూడా పవన్ కళ్ళెదుటే జరిగిపోయింది. ఇదే సమయంలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ ఓడిపోయారు. అలాగే పార్టీకి చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లే దక్కలేదు.

అప్పటి నుంచి జగన్ అంటే పవన్ కు బాగా మండుతోంది. మళ్ళీ ఇంతకాలానికి అప్పటి ఛాలెంజ్‌నే మళ్ళీ పవన్ రిపీట్ చేశారు. అప్పటికి, ఇప్పటికీ జగన్ బలహీనపడ్డారా లేకపోతే పవన్ బలం పెరిగిందా..? అన్నదే అర్థం కావటంలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్‌ను అడ్డుకోలేకపోయిన పవన్, అధికారంలో ఉన్నప్పుడు ఎలా అడ్డుకోగలరు..? జగన్‌ను గెలిపించటం, తనను ఓడించటం అంతా జనాలు చేతుల్లో ఉంది కానీ తనచేతిలో ఏమీ లేదని పవన్ గ్రహించకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

పవన్ అనుకుంటే జగన్ ఓడిపోరు. జనాలు అనుకుంటేనే జగన్ ఓడుతారనే కనీస ఇంగితం కూడా పవన్‌లో లోపించింది. జనాల నమ్మకాన్ని గెలుచుకునేందుకు పవన్ ఏమిచేస్తున్నట్లు..? ఎంతసేపు జగన్ పై బురదచల్లేయటం, శాపనార్ధాలు పెట్టడం తప్ప జనాల్లో నమ్మకం కలిగేట్లుగా ఏమి చేయటంలేదు. జనాల్లో నమ్మకం పెంచుకోనంతవరకు 'పిల్లి శాపాలకు ఉట్టి తెగుతుందా' అనే సామెతనే అందరూ గుర్తుచేసుకుంటారు.

Tags:    
Advertisement

Similar News