ఆఖరి సీటు కూడా టీడీపీ వలస నేతకే.. లాంఛనం పూర్తి చేసిన పవన్

స్థానిక జనసేన నేతల్ని కన్విన్స్ చేసేందుకు సర్వేలంటూ డ్రామాకి తెరతీశారు పవన్. ఆ సర్వేలో జయకృష్ణకు ఆమోదం లభించిందని చెప్పి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

Advertisement
Update:2024-04-10 08:03 IST

జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ సీట్లలో ఇప్పటి వరకు 20 సీట్లు ఫైనల్ కాగా తాజాగా ఆఖరి అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేశారు పవన్ కల్యాణ్. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాలకొండలో నిమ్మక జయకృష్ణను ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. ఈమేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పలు దఫాలు సర్వేలు చేపట్టామని, అందులో జయకృష్ణకు మద్దతు లభించిందని, ఆందుకే ఆయన్ను ఎంపిక చేశామని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


విశేషం ఏముంది..?

2019లో నిమ్మక జయకృష్ణ టీడీపీ అభ్యర్థిగా పాలకొండనుంచి పోటీ చేసి 1620 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఆయన ఆ సీటుపై మరింత ఫోకస్ పెంచారు. చాన్నాళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పొత్తుల్లో ఆ స్థానం జనసేనకు వెళ్లడంతో చంద్రబాబు చక్రం తిప్పారు. జయకృష్ణను జనసేనలోకి పంపించారు. ఆయన చేరికతో టికెట్ కూడా ఆయనకు ఖాయమనే విషయం ఇదివరకే తేలిపోయింది. కానీ స్థానిక జనసేన నేతల్ని కన్విన్స్ చేసేందుకు సర్వేలంటూ డ్రామాకి తెరతీశారు పవన్. ఆ సర్వేలో జయకృష్ణకు ఆమోదం లభించిందని చెప్పి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

పొత్తులో భాగంగా జనసేనకు దక్కిన 21 స్థానాల్లో 10మంది వలస నేతలే ఉన్నారనేది బహిరంగ రహస్యం. అప్పటికప్పుడు కండువాలు కప్పి వారికే టికెట్లు ఖరారు చేశారు పవన్. చివరిగా ప్రకటించిన పాలకొండ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. నిమ్మక జయకృష్ణ టీడీపీనుంచి జనసేనలోకి వచ్చి టికెట్ సాధించారు. గాజు గ్లాస్ గుర్తుపై గెలిచినా ఆయన చంద్రబాబుకే కట్టప్ప అనేది అందరికీ తెలుసు. సర్వేలంటూ ఊరించి పాలకొండ టికెట్ ఆశించిన జనసేన నేతలకు చివరికి షాకిచ్చారు పవన్ కల్యాణ్. 

Tags:    
Advertisement

Similar News