సజ్జల భార్గవ్‌రెడ్డిపై లుకౌట్ నోటీసులు
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 8న పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏపీలో భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వర్రా రవీందర్‌రెడ్డి పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు తెలిపాడు.
ఐప్యాక్ టీమ్ కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో ఫోస్ట్ చేసే వాళ్లం జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో పోస్ట్ చేసేవాళ్లం వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టమన్నారు.‘సజ్జల భార్గవ్‌రెడ్డి వైకాపా సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్నాక మరింత రెచ్చిపోయాం. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని అతడే బెదిరించాడు. 2023 నుంచి నా ఫేస్‌బుక్ ఐడీతో పోస్టులు పెట్టేవారు. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకం’’ అని పోలీసులకు తెలిపాడు.