సజ్జల వ్యాఖ్యలతో హర్ట్ అయిన లోకేష్..

మాతో పెట్టుకోవద్దు, మేం అధికారంలోకి వస్తే మీకు షాకివ్వడం ఖాయమంటూ పంచ్ డైలాగులు వాడారు లోకేష్. అంతా బాగానే ఉంది కానీ ఆ తిట్లు కూడా ఆయన పేపర్ చూసి చదవడమే కాస్త విచిత్రంగా అనిపిస్తోంది.

Advertisement
Update:2023-06-05 22:09 IST

లోకేష్ కి పుట్టుకకు ముందే వైకల్యం ఉందని, తల్లి గర్భంలో ఉండగానే ఆయనకు వైకల్యం తోడైందని ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కామెంట్లతో లోకేష్ బాగా హర్ట్ అయినట్టున్నారు. యువగళం యాత్రలో ప్రత్యేకంగా ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు టైమ్ కేటాయించారు. సజ్జలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన గంతులేస్తున్నారని అన్నారు. అదే సమయంలో సీఎం జగన్ కి కూడా వైకల్యం ఉందంటూ కామెంట్ చేశారు లోకేష్.


తండ్రి శవాన్ని పక్కనపెట్టుకుని సీఎం అవ్వాలని సంతకాలు చేయించారని, సొంత బాబాయ్ ని లేపేశారని, తల్లి, చెల్లిని కూడా బయటకు గెంటేశారని విమర్శలు చేశారు లోకేష్. సీఎం జగన్ కి లండన్ నుంచి మందులు వస్తాయని, వాటిని వాడకపోతే సైకో తనం మరింత పెరుగుతుందన్నారు. అందుకే వాటిని రోజూ వాడుతుంటారని, ఆ విషయం సజ్జలకు తెలియకపోవచ్చని చెప్పారు లోకేష్.

తిట్లు కూడా చూసి చదవాలా..

మాతో పెట్టుకోవద్దు, మేం అధికారంలోకి వస్తే మీకు షాకివ్వడం ఖాయమంటూ పంచ్ డైలాగులు వాడారు లోకేష్. అంతా బాగానే ఉంది కానీ ఆ తిట్లు కూడా ఆయన పేపర్ చూసి చదవడమే కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. సజ్జల వ్యాఖ్యలకు కౌంటర్ గా సజ్జలతోపాటు, జగన్ ని కూడా కలిపి తిట్టిన లోకేష్ అక్కడున్న టీడీపీ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు. ఈ ఘాటు వ్యాఖ్యలకు వైసీపీ నుంచి మరింత ఘాటు రియాక్షన్ ఉంటుంది కాబోలు. 

Tags:    
Advertisement

Similar News