అసలు పిలుపే తప్పు
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనాలందరు మద్దతు పలకాలని లోకేష్+బ్రాహ్మణి కోరారు. మద్దతు ఎలా తెలపాలంటే విజిల్స్ వేసి, తప్పట్లు కొట్టి, వాహనాల హారన్లుకొట్టి, కంచాలపై శబ్దాలు చేస్తు 5 నిమిషాలు నిరసనలు తెలపాలని కోరారు. నిజానికి ఈ పిలుపే తప్పు. ఎందుకంటే ఇవన్నీ చేసేది సంతోషం కోసం.
నారా లోకేష్ ఇచ్చిన పిలుపు పేలవంగా ముగిసింది. చాలా చోట్ల పార్టీ నేతలు, చంద్రబాబు అభిమానులు తప్ప మామూలు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. పార్టీలోని క్యాడరే పెద్దగా పట్టించుకోకపోతే ఇక మామూలు జనాలు ఎందుకు స్పందిస్తారు? స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనాలందరు మద్దతు పలకాలని లోకేష్+బ్రాహ్మణి కోరారు. మద్దతు ఎలా తెలపాలంటే విజిల్స్ వేసి, వాహనాల హారన్లు కొట్టి, కంచాలపై శబ్దాలు చేస్తు 5 నిమిషాలు నిరసన తెలపాలని కోరారు. నిజానికి ఈ పిలుపే తప్పు. ఎందుకంటే ఇవన్నీ చేసేది సంతోషం కోసం.
విజిల్స్ వేసేది, తప్పట్లు కొట్టేది, శబ్దాలు చేసేది హ్యాపీగా ఉన్నపుడే కదా. అసలు ఈ పిలుపు ఆలోచన లోకేష్‌కు వచ్చినది అయ్యుండదు. ఎందుకంటే లోకేష్‌కు ఇంతటి ఆలోచన వచ్చిందంటే ఎవరు నమ్మటంలేదు. ఎవరో వెనకుండి తప్పుడు సూచన చేసి లోకేష్‌ను తప్పుదారిలో నడిపించారు. నిజానికి చంద్రబాబు అరెస్టయి మూడు వారాలు అవుతున్నా జనాలు అసలు పట్టించుకోనేలేదు. చంద్రబాబును అరెస్టు చేసి నంద్యాల నుండి విజయవాడకు తీసుకొచ్చినపుడే పట్టించుకోని జనాలు ఇన్నిరోజుల తర్వాత పట్టించుకుంటారా?
ఏపీలో జరుగుతున్న రాజకీయమంతా జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబు మధ్య బల ప్రదర్శనే అని అందరికీ తెలుసు. చంద్రబాబుకు సాగినంతకాలం జగన్‌ను నానా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని జనాలంతా చూశారు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది చంద్రబాబును దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. కాకపోతే పడుతున్న దెబ్బలను 73 ఏళ్ళ వయసులో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారంతే. కాలం ఎప్పుడూ తనకే అనుకూలంగా ఉంటుందనే భ్రమలో ఉండటం వల్లే చంద్రబాబు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
ఎప్పుడైనా కాలం ఎదురుతిరిగితే తన పరిస్థితి ఏమిటని ఒక్క నిమిషం ఆలోచించుకుని ఉండుంటే చంద్రబాబుకు ఇప్పుడు ఇంత పరిస్థితి ఉండేదికాదేమో. మొత్తానికి పార్టీ ఇప్పుడు చుక్కాని లేని నావలా వెళుతోంది. అందుకనే నిరసన కార్యక్రమాలకు, సంతోషంలో ఉన్నపుడు చేసే పనులకు తేడా కూడా తెలుసుకోకుండా పిలుపునిచ్చారు. చివరకు ఏమైందంటే పార్టీ నేతలు మొక్కుబడిగాను, క్యాడర్ పెద్దగా స్పందించనే లేదు. పార్టీ నేతలకు, క్యాడరే స్పందించనప్పుడు ఇక మామూలు జనాలు ఎందుకు స్పందిస్తారు? లోకేష్ పిలుపు వల్ల ఏమి తేలిందంటే చంద్రబాబు అరెస్టును జనాలు పెద్దగా పట్టించుకోలేదని.
♦