ముస్లింల దెబ్బని చంద్రబాబు తట్టుకోగలడా..? పవన్ కళ్యాణ్ గుక్క తిప్పుకోగలడా..??
మొత్తం 61 నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపు ఓటములు నిర్ణయించే స్థితిలో ఉన్నారు. రెండు నుంచి అయిదు వేల ఓట్లతో గెలిచే ఎమ్మెల్యేలు అనేకమంది ఉంటారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి అరవై వేల దాకా ఉన్న ముస్లిం ఓటర్ల పాత్ర ఎంత కీలకమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
బీసీలు, కాపులు, దళితుల్లాగే ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం జనాభా చెప్పుకోదగినంతగా ఉంది. సెక్యులర్ కబుర్లు చెప్పే చంద్రబాబు, బీజేపీ అగ్రనాయకత్వం ముందు సాష్టాంగపడి పొత్తుపెట్టుకోవడం, ముస్లింలను సహజంగానే హర్ట్ చేసింది. బీజేపీ దురుసుతనం వల్ల, ఆర్‌ఎస్‌ఎస్ హెచ్చరికల వల్ల ముస్లింలు భయంతో, అభద్రతతో అసహనంగా ఉన్నారు. ఎన్నికల కోసం చంద్రబాబు ప్లేటు ఫిరాయించడంతో ముస్లింలు ఇరకాటంలో పడ్డారు. జగన్మోహన్‌రెడ్డి పార్టీకి ఓటేయడం తప్ప వాళ్లకి మరో దారిలేదు. ముస్లింలు దూరం అయితే మాకేం అని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉండే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏకంగా 62 నియోజకవర్గాల్లో ముస్లింలు బలమైన శక్తిగా ఉన్నారు.
నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఒక్క కడపలోనే 90 వేల మందికిపైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. కర్నూలులో 85,000, రాజంపేటలో 70,000, నంద్యాలలో మరో 70,000 ముస్లింలు ఓటర్లుగా నమోదయి ఉన్నారు. కదిరి, నెల్లూరుల్లో అరవయ్యేసి వేలమంది, హిందూపూర్, ప్రొద్దుటూరులో 55 వేల మంది చొప్పున ఓటర్లు ఉన్నారు. అలాగే పీలేరు, అనంతపురం అర్బన్‌లో కూడా 55 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఆదోని, ఆళ్లగడ్డ, మదనపల్లి, నియోజకవర్గాల్లో యాభయ్యేసి వేల మంది మైనార్టీలు ఓటర్లుగా రిజిస్టర్ అయి ఉన్నారు. గుంతకల్లు, పుంగనూరుల్లో 45,000 మంది చొప్పున ఉన్నారు. ఒక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే 56 వేల మంది చైతన్యవంతులైన ముస్లిం ఓటర్లు ఉన్నారు.
చిలకలూరిపేటలో 40,000, శ్రీశైలంలో 47 వేల మంది ముస్లింలు ఓటు హక్కు కలిగి ఉన్నారు. పాణ్యంలో 50 వేల మంది, పలమనేరులో 45 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. బనగానపల్లిలో 40 వేల మంది, తాడికొండలో 35 వేల మంది ఓటర్లుగా నమోదయి ఉన్నారు. తిరుపతిలో 40 వేల మంది ఉన్నారు. గురజాల, పొన్నూరు, సత్తెనపల్లిలో 35 వేల మంది చొప్పున రిజిస్టర్ అయి ఉన్నారు. ఒక్క కమలాపురంలోనే 70 వేల మంది ముస్లింలు ఉన్నారు. గిద్దలూరులో 30 వేలు, పెనమలూరులో 40 వేలు, పెదకూరపాడులో 30 వేలు, పులివెందులలో 30 వేలు, తంబళ్లపల్లిలో 30 వేలు, డోన్‌లో 30,000, మైదుకూరులో 30 వేలు, విజయవాడ సెంట్రల్‌లో 30 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. మచిలీపట్నంలో 40 వేలు, మంగళగిరిలో 32 వేలు, కొవ్వూరులో 32 వేల మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు. గన్నవరంలో 35 వేలు, గుడివాడలో 33 వేలు, విశాఖపట్నంలో 35 వేల మంది నమోదై ఉన్నారు. ఒక రాయచోటి నియోజకవర్గంలోనే ఏకంగా లక్ష మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇంకా చంద్రగిరిలో 25 వేలు, ధర్మవరంలో 22 వేలు, ఉదయగిరిలో 22 వేల మంది ముస్లింలు ఓటర్లుగా ఉన్నారు.
అంటే మొత్తం 61 నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపు ఓటములు నిర్ణయించే స్థితిలో ఉన్నారు. ఒక అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి అయినా 10–15 వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే అది ఘన విజయం అంటున్నారు. రెండు నుంచి అయిదు వేల ఓట్లతో గెలిచే ఎమ్మెల్యేలు అనేకమంది ఉంటారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి అరవై వేల దాకా ఉన్న ముస్లిం ఓటర్ల పాత్ర ఎంత కీలకమైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇదే ఇప్పుడు చంద్రబాబుని కలవరపెడుతున్న సమస్య. బీజేపీతో పొత్తు ఆనందం పాలపొంగులా చల్లారిపోడానికి ముస్లిం ఓటర్ల సమస్య ఒక కారణం. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లనూ ఊడబీకుతాం అని బీజేపీ పదే పదే చెబుతోంది. ముస్లింల మీద తరచుగా దాడులు, మసీదులు కూల్చేస్తాం అనే బెదిరింపులు మైనార్టీలను భయపెడుతున్నాయి. కనుక, ఈసారి ముస్లింలు కూడబలుక్కుని చంద్రబాబు కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలే ఎక్కువ.
ఈ పరిస్థితి జగన్మోహన్‌రెడ్డికి పెద్ద భరోసా ఇస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లని వణికిస్తోంది. ముస్లింలు తమశక్తిని చూపించే సమయం ఆసన్నమౌతోంది..! రంజాన్ నెలవంక ముస్లింలలో కొత్త విశ్వాసాన్ని నింపుతోంది.