'రోజా' రోజువారీ పనులు.. మహిళా ఎమ్మెల్సీ హాట్ కామెంట్స్

ఉదయం ఎక్సర్ సైజ్ లు చేసే రోజా, మధ్యాహ్నం నాన్ వెజ్ భోజనం తింటారని, రాత్రి పూట పార్టీలకు వెళ్తారని.. అది మినహా ఆమె ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి, మంత్రిగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు ఎమ్మెల్సీ అనురాధ.

Advertisement
Update:2023-10-24 15:02 IST

భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్రపై మంత్రి రోజా విమర్శలు చేసిన కాసేపటికే అటువైపు నుంచి కూడా కౌంటర్లు పడ్డాయి. నిజం గెలవాలంటే స్కిల్ స్కామ్ పై సీబీఐ ఎంక్వయిరీ కోరాలని భువనేశ్వరికి సలహా ఇచ్చారు మంత్రి రోజా. ఆ నిజం గెలవాలంటే.. రోజా కూడా సీబీఐ ఎంక్వయిరీ కోరాలంటూ కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. గతంలో బ్యాంకు అకౌంట్లలో డబ్బుల్లేక చెక్ బౌన్స్ లు అయ్యే స్థితిలో ఉన్న రోజా నేడు వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు.. అని సూటిగా ప్రశ్నించారు. సీబీఐ ఎంక్వయిరీ కోరే దమ్ము రోజాకు ఉందా అని అడిగారు. పోనీ తనపై ఉన్న కేసుల్లో త్వరగా ఎంక్వయిరీ పూర్తి చేయాలని సీబీఐ, ఈడీని కోరే దమ్ము సీఎం జగన్ కి ఉందా అని ప్రశ్నించారు అనురాధ.

ఫ్యాషన్ షో కు వెళ్లినట్టు.. రెడీ అయి వెళ్లేవారు యాత్రలు ఎలా చేస్తారని రోజా ప్రశ్నించడాన్ని కూడా ఎమ్మెల్సీ అనురాధ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు రోజా స్థాయి ఏంటి.. ఆమె మాట్లాడే మాటలేంటి అని కౌంటర్ ఇచ్చారు. నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ అయి ఉండి కూడా ఇలాంటి భాష ఏంటని మండిపడ్డారు.

ఉదయం ఎక్సర్ సైజ్ లు చేసే రోజా, మధ్యాహ్నం నాన్ వెజ్ భోజనం తింటారని, రాత్రి పూట పార్టీలకు వెళ్తారని.. అది మినహా ఆమె ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి, మంత్రిగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు ఎమ్మెల్సీ అనురాధ. రోజాకు 16 కార్లు ఉన్నాయని, 4 పెట్రోలు బంకులున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూముల్ని కూడా రోజా, ఆమె అన్నదమ్ములు ప్రజల నుంచి బలవంతంగా లాగేసుకున్నారని చెప్పారు. నగరిని రోజా కుటుంబం దోచేసిందని అన్నారు. తాను సంపాదించిన వందల కోట్ల రూపాయల ఆస్తులపై సీబీఐ ఎంక్వయిరీ కోరే దమ్ము రోజాకి ఉందా అని సవాల్ విసిరారు ఎమ్మెల్సీ అనురాధ. 


Tags:    
Advertisement

Similar News