నువ్వు జబర్దస్త్ ఆంటీ.. నువ్వే ఐరన్ లెగ్ అంకుల్
“నువ్వు అంకుల్ కాదా? మీ నాన్న తాత కాదా? మీ అమ్మ అవ్వ కాదా? మీ అమ్మకు ఏమైనా 16 ఏళ్ల వయసా? తిరిగి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో నీకు తెలియదు! జాగ్రత్తగా వుండు” అంటూ లోకేష్ కి వార్నింగ్ ఇచ్చారు రోజా.
జబర్దస్త్ ఆంటీ అంటూ కామెంట్ చేసిన నారా లోకేష్ కి తిరిగి కౌంటర్ ఇచ్చేశారు మంత్రి రోజా. తాను జబర్దస్త్ ఆంటీ అయితే, లోకేష్ ఐరన్ లెగ్ అంకుల్ అంటూ మండిపడ్డారు. లోకేష్ అడుగు పెట్టిన తర్వాతే టీడీపీ పతనం మొదలైందని పాదయాత్రల్లో మనుషులు చచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఐరన్ లెగ్ అంకుల్ రాష్ట్రమంతా తిరిగితే ఏమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు రోజా.
లోకేష్ ఏమన్నారు..?
యువగళం పాదయాత్రలో భాగంగా నగరి నియోజకవర్గంలో పర్యటించిన నారా లోకేష్, రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోటీగా డైమండ్ పాప తయారైందని అన్నారు, ఆమెను డైమండ్ పాప అంటే బాగా ఫీలయ్యారని, ఇక నుంచి జబర్దస్త్ ఆంటీ అని పిలుస్తానని సెటైర్లు వేశారు. లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి రోజా అంతకంటే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఐరన్ లెగ్ అంకుల్ అంటూ బదులిచ్చారు.
“నువ్వు అంకుల్ కాదా? మీ నాన్న తాత కాదా? మీ అమ్మ అవ్వ కాదా? మీ అమ్మకు ఏమైనా 16 ఏళ్ల వయసా? తిరిగి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో నీకు తెలియదు! జాగ్రత్తగా వుండు” అంటూ లోకేష్ కి వార్నింగ్ ఇచ్చారు రోజా.
చూద్దాం నీ ప్రతాపమో, నా ప్రతాపమో..
నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అన్నారు మంత్రి రోజా. జనాలు రాకపోవడంతో ప్రజల కోసం 12 గంటలనుంచి 14గంటల సేపు లోకేష్ వేచి చూస్తున్నారని చెప్పారు. ఆయన లీడర్ షిప్ ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తాను, లోకేష్ జనంలోకి వెళ్తామని.. ఎవరిని చూసి ఎక్కువమంది జనం వస్తారో చూద్దామా అంటూ సవాల్ విసిరారు.
జబర్దస్త్ అంటే అంత చులకనా..?
జబర్దస్త్ అనేది చాలా మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి కామెడీ షో అని, దాన్ని బూతులాగా వెటకారంగా మాట్లాడితే మహిళలు, లోకేష్ ని దేంతో కొట్టాలో దాంతో కొడతారని మండిపడ్డారు రోజా. జగన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా.. పోతే పోనీలే అని లోకేష్ ని వదిలేశారని.. జగన్ దృష్టి పెడితే లోకేష్ ఎక్కడుంటాడో తెలియదన్నారు. పోలీసులు తన దగ్గర మైక్ లాక్కుంటున్నారని పదే పదే లోకేష్ ఆరోపిస్తున్నారని, నిజంగానే ఆయనకు మైకిస్తే పంది ముట్లు, ప్రశాంత అత్త, కొర్రీలు అనే ఆణిముత్యాలను వినాల్సి వస్తుందన్నారు.