చంద్రబాబుకి తాపీ మేస్త్రీ, శిలాఫలకం చాలు

ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు మంత్రి అమర్నాథ్. ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చిన చరిత్ర టీడీపీదే అన్నారు.

Advertisement
Update:2023-05-02 22:01 IST

ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలన్నా, నిర్మాణం చేపట్టాలన్నా.. చంద్రబాబుకి ఒక తాపీ మేస్త్రీ, ఒక శిలా ఫలకం ఉంటే చాలని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడి అమర్నాథ్. శిలాఫలకాలు వేసి, ప్రాజెక్టులన్నీ తానే తెచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకి పదే పదే శంకుస్థాపనలేంటని టీడీపీ విమర్శించడాన్ని మంత్రి అమర్నాథ్ తప్పుబట్టారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కి సంబంధించి టీడీపీ హయాంలో ప్రధాన రన్ వే నిర్మాణం జరిగే భూమి లిటిగేషన్ లో ఉందని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ లిటిగేషన్ ని క్లియర్ చేశామని చెప్పారు. పునరావాసం, భూ సమీకరణ, ఆర్ధిక వనరులు సమీకరణ జరగక ముందే చంద్రబాబు శంకుస్థాపన పేరుతో హడావిడి చేశారని, ఇప్పుడు జగన్ చేతులమీదుగా జరిగేది అసలైన శంకుస్థాపన అని వివరించారు.

ఉత్త ఆంధ్ర - ఉత్తమాంధ్ర

ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు మంత్రి అమర్నాథ్. ఉత్తరాంధ్రను ఉత్తి ఆంధ్రగా మార్చిన చరిత్ర టీడీపీదే అన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో 2025నాటికి తొలి ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అందుబాటులో వచ్చే నాటికి విశాఖ-భోగాపురం మధ్య 6,500కోట్ల రూపాయలతో 6లైన్స్ రహదారి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

రజినీకాంత్ సినిమాల్లోనే సూపర్ స్టార్..

రజినీకాంత్ ఎపిసోడ్ పై కూడా మంత్రి అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబు గురించి రజనీకాంత్ చెప్పిన అబద్ధాలను మాత్రమే తాము ప్రశ్నించామని, వాటినే తాము వ్యతిరేకించామన్నారు. సినిమాల్లో లాగా ఎవరినైనా ఏమైనా అంటాం అంటే సమాజంలో కౌంటర్ ఫేస్ చేయవలిసిందేనన్నారు. సినిమాల్లో మాత్రమే రజనీకాంత్ సూపర్ స్టార్ అని, ఒక సారి చెబితే వంద సార్లు చెప్పినట్టు ఫీల్ అవడానికి రాజకీయాలు సినిమా కాదని చెప్పారు. అసలు రజనీకాంత్ కు తామెందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. 

Tags:    
Advertisement

Similar News