హద్దుమీరావు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్ జాగ్రత్త
టీడీపీతో పొత్తుని జనసేన కార్యకర్తలు అంగీకరించటం లేదని అన్నారు మంత్రి అంబటి. చంద్రబాబు కాళ్ళు పిసకమని పవన్ ఆదేశిస్తే జన సైనికులు, వీర మహిళలు అందుకు సిద్ధంగా లేరన్నారు.
నువ్వెంత, నీ బతుకెంత..? అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని పవన్ కల్యాణ్ విమర్శించేముందు, తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించారా అని హెచ్చరించారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ హద్దుమీరాడని మండిపడ్డారు. అసలు జగన్ ని అనడానికి పవన్ బతుకెంత..? అని ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన పవన్, ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే పవన్ కి జగన్ ని విమర్శించే అర్హత లేదన్నారు.
టీడీపీతో పొత్తుని జనసేన కార్యకర్తలు అంగీకరించటం లేదని అన్నారు మంత్రి అంబటి. చంద్రబాబు కాళ్ళు పిసకమని పవన్ ఆదేశిస్తే జన సైనికులు, వీర మహిళలు అందుకు సిద్ధంగా లేరన్నారు. జనసేన, టీడీపీ కలిసి వస్తాయని, కలసి రావాలని తాము ముందే అనుకున్నామని, అలా కలసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదేనన్నారు అంబటి. చంద్రబాబు జైలుకెళ్తే ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ ఎక్కువ గగ్గోలు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కలసి పోటీ చేస్తే ఏమవుతుందని, రెండు అంకెలు కలిస్తే కొత్త అంకె వస్తుందని.. రెండు సున్నాలు కలిస్తే మళ్లీ సున్నానే వస్తుందని అన్నారు అంబటి. ఏపీ రాజకీయల్లో నైతిక విలువలు లేని ఏకైక వ్యక్తి పవన్ అని దుయ్యబట్టారు. ఒకరిని పెళ్ళి చేసుకుని మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించే వ్యక్తి ఆయన అని అన్నారు అంబటి.
నాదెండ్ల కొంగు పట్టుకుని..
కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు.. నాదెండ్ల మనోహర్ కొంగు పట్టుకుని పవన్ ఏపీ రాజకీయ సముద్రంలో ఈదుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి. టీడీపీతో పొత్తు అనే తీర్మానం కోసం మనోహర్ ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారని, ఇప్పుడు అదే జరిగిందని చెప్పారు. టీడీపీకి ప్రాణం పోసేందుకు జనసేన ప్రాణం తీశారన్నారు. నన్ను ఏం పీకారు అని ప్రశ్నించిన చంద్రబాబు ఈరోజు జైలులో ఉన్నారని, ఆ విషయం పవన్ గుర్తుంచుకోవాలన్నారు అంబటి.
♦