అప్పుడు ఫీలయ్యా 'బ్రో'.. ఇప్పుడు కాచుకో 'బ్రో'

ఆయన వేసిన ట్వీట్లలో పవన్ ని వెటకారం చేయడంతోపాటు బ్రో మూవీలో తనను కామెంట్ చేసినందుకు ఇది రివేంజ్ అని చెప్పాలనే తాపత్రయం కనపడుతోంది. మొత్తమ్మీద అంబటి, టిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నారు, టైమ్ చూసి ఇచ్చేశారు.

Advertisement
Update:2023-09-11 13:32 IST

'బ్రో' సినిమా టైమ్ లో మంత్రి అంబటి రాంబాబు, జనసేన మధ్య మాటల తూటాలు పేలాయి. అంబటి ఢిల్లీకి కూడా వెళ్లడం ఆ ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామం. లెక్కలు తేలుస్తానన్న ఆయన తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆయనకు టైమ్ వచ్చింది, తన తడాఖా చూపిస్తున్నారు, పవన్ పై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు అంబటి.


చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలంతా టీడీపీని టార్గెట్ చేశారు, కానీ అంబటి మాత్రం టీడీపీతోపాటు పవన్ ని కూడా బాగా టార్గెట్ చేశారు. ట్విట్టర్లో ఓ ఆటాడేసుకుంటున్నారు. తాజాగా మరోసారి పవన్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు అంబటి.

సొంత లాభం కొంత మానుకుని

పొరుగు వాడికి తోడుపడవోయి!

--నాటి గురజాడ మాట

సొంత పార్టీని సర్వ నాశనం చేసుకుని

పొరుగు పార్టీని బ్రతికించవోయ్ !

--నేటి పవన్ మాట

అంటూ పవన్ ని కార్నర్ చేశారు మంత్రి అంబటి. ఏపీకి వస్తూ పోలీసులు అడ్డుకోవడంతో పవన్ నేలపై పడుకున్నప్పుడు కూడా మరో ఘాటు ట్వీట్ వేశారు. అవినీతి బాబు ని అరెస్ట్ చేస్తే నీకు ఇదేమి కర్మ "BRO"! అంటూ బ్రో వ్యవహారాన్ని కూడా గుర్తు చేశారు. అరెస్ట్ వ్యవహారంపై చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా పవన్ ని కదిలించారు అంబటి.

హలో ... ఏమైపోయావ్ "BRO"!

బాబు గారు బొక్కలోకి పోతానంటున్నాడు

వచ్చి.. పలకరించి, పులకరించి... పో !

అంటూ పవన్ ని కూడా మెన్షన్ చేస్తూ ట్వీట్లు వేశారు. ఆయన వేసిన ట్వీట్లలో పవన్ ని వెటకారం చేయడంతోపాటు బ్రో మూవీలో తనను కామెంట్ చేసినందుకు ఇది రివేంజ్ అని చెప్పాలనే తాపత్రయం కనపడుతోంది. మొత్తమ్మీద అంబటి, టిట్ ఫర్ టాట్ ఇవ్వాలనుకున్నారు, టైమ్ చూసి ఇచ్చేశారు.

Tags:    
Advertisement

Similar News