వాళ్లు జనసైనికులు కాదు.. సైకిల్ సైనికులు
బందరు సభలోనైనా పవన్ కల్యాణ్, తన అనుచరులకు ఓ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఇంతకీ బీజేపీతో ఉన్నావో లేదో నీ క్యాడర్ కైనా చెప్పు బ్రో అని అని చురకలంటించారు.
జనసేన పార్టీ కార్యకర్తలు ఇక ఎంతమాత్రం జనసైనికులు కాదని, సైకిల్ సైనికులేనని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ సైకిల్ కు తుప్పు పట్టిందని, టైర్లు లేవు అని.. ఇప్పుడా డొక్కు సైకిల్ మోసే బాధ్యత జనసైనికుల భుజానికెత్తారని సెటైర్లు పేల్చారు. చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోంద్నారు. జనసేన అవినీతి జెండా కూడా చంద్రబాబు అవినీతి డబ్బుతోనే ఎదుగుతోందన్నారు. సర్వనాశనం అయిపోయిన టీడీపీని పవన్ బతికించాలనుకుంటున్నారని దెప్పిపొడిచారు అంబటి.
క్లారిటీ ఇవ్వు..
బందరు సభలోనైనా పవన్ కల్యాణ్, తన అనుచరులకు ఓ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఇంతకీ బీజేపీతో ఉన్నావో లేదో నీ క్యాడర్ కైనా చెప్పు బ్రో అని అని చురకలంటించారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత అనైతిక వ్యక్తి పవన్ కల్యాణేనని విమర్శించారు అంబటి. చంద్రబాబుతో కలిసొస్తే ఆదరణ ఉండదనే విషయం వారాహి యాత్ర ఫ్లాప్ కావడంతో పవన్ కి అర్థమై ఉంటుందన్నారు. కొండనాలుకకు మందేస్తే.. ఉన్ననాలుక ఊడిందన్నట్టుగా.. వారాహి యాత్ర మారిపోయిందన్నారు. చంద్రబాబుతో కలిసి వస్తున్నానని చెప్పగానే వారాహి నాలుగో విడత యాత్ర ఫ్లాప్ షో గా మిగిలిందన్నారు మంత్రి అంబటి.
కాపు డామినేషన్ ప్రాంతాల్లోనే వారాహి సభలా..?
కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పవన్ సభలు పెడుతున్నారని, ఇదంతా నక్కజిత్తుల చంద్రబాబు జిమ్మిక్కు అని అన్నారు అంబటి. పవన్ సభలకు వెళ్లండి అని లోకేష్ ట్వీట్ చేసినా కూడా ఫలితం లేదన్నారు. సాయంత్రం ఆరు గంటలైనా పవన్ సభకు జనం రాలేదని, వారాహి యాత్ర ఫ్లాప్ అయిందని విమర్శించారు. చంద్రబాబుతో పొత్తును ప్రజలు ఛీ కొట్టారన్నారు. బీజేపీతో ఉన్నాను అంటావ్.. టీడీపీతో వెళ్తాను అంటావ్. బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసేందుకు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు అంబటి. చంద్రబాబుతో పొత్తు ప్రకటన తర్వాత పవన్ బాడీలాంగ్వేజ్ మారిపోయిందని, రాజకీయాలకు పనికి రాని వ్యక్తి.. చంద్రబాబు చెప్పులు మోసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి.