తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో వేడుకగా పుష్పార్చన
Advertisement
పవిత్ర కార్తికమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ పుష్ప కైంకర్యం నిర్వహించారు. చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా, గన్నేరు, మల్లె, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. వేద పండితులు వేదాలను పఠించారు. పుష్పయాగానికి దాతలు మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను అందించారు.
Advertisement