లోకేష్‌కు ముందు ముందు తెలుస్తుందా?

ఎల్లో మీడియా ఎదురుగా ఉందికదా అని లోకేష్ బాగా రెచ్చిపోతున్నారు. ఇలా రెచ్చిపోయిన పర్యవసానాన్నే చంద్రబాబునాయుడు 34 రోజులుగా రాజమండ్రి జైలులో అనుభవిస్తున్నారు.

Advertisement
Update:2023-10-12 10:45 IST

తన జోకుల పర్యవసానం లోకేష్‌కు ముందు ముందు కానీ తెలియ‌దు. సీఐడీని కావాలనే లోకేష్ చాలా చులకనగా మాట్లాడుతున్నారు. లోలోపల ఎంత భయం ఉందో తెలియ‌దు.. కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు విచారణ పేరుతో తన రెండు రోజుల విలువైన సమయాన్ని సీఐడీ వృధా చేసిందని మీడియా ముందే చాలా ఓవర్ యాక్షన్ చేశారు. సీఐడీ విచారణకు పిలిచి గూగుల్ సెర్చ్‌లో వెతికినా దొరికే సమాచారాన్ని తన నుండి తెలుసుకోవాలని అనుకోవటం ఏమిటని సెటైర్లు వేశారు.

రెండోరోజు విచారణలో కూడా అనవసరమైన ప్రశ్నలే వేసినట్లు చెప్పారు. కోర్టు తనను విచారించేందుకు ఒక్కరోజు మాత్రమే అనుమతించినా తాను పోనీలే కదాని రెండోరోజు విచారణకూ హాజరైనట్లు ఫోజులు కొట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రెండు రోజుల విచారణలో పనికిమాలిన ప్రశ్నలు వేసి సమయాన్ని వృధా చేసుకోవటానికి సీఐడీకి ఏమన్నా పిచ్చా? విచారణలో సీఐడీ ఏమి ప్రశ్నలు వేసింది? లోకేష్ ఏమని సమాధానాలు చెప్పారన్న విషయాన్ని మొత్తం వీడియో తీసుంటారు.

విచారణ సమాచారాన్ని కోర్టుకు రిపోర్టు రూపంలో సీఐడీ అందించిన‌ప్పుడు లోకేష్ కథేంటో తెలుస్తుంది. ఆ తర్వాత సీఐడీ అరెస్టు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అరెస్టయిన తర్వాత విచారణ తీవ్రత ఏమిటో లోకేష్‌కు అప్పుడు అర్థ‌మవుతుంది. తనను సీఐడీ ప్రశ్నించటం కాదని, తానే సీఐడీని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని, అధికారులు తెల్లమొహం వేశారని ఎల్లో మీడియా ముందు ఎన్ని కథ‌లైనా చెప్పొచ్చు. సీఐడీ గనుక అరెస్టు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వేసిన జోకుల రిజ‌ల్ట్‌ ఏంటో?

ఎల్లో మీడియా ఎదురుగా ఉందికదా అని లోకేష్ బాగా రెచ్చిపోతున్నారు. ఇలా రెచ్చిపోయిన పర్యవసానాన్నే చంద్రబాబునాయుడు 34 రోజులుగా రాజమండ్రి జైలులో  అనుభవిస్తున్నారు. తన తండ్రి పరిస్థితిని చూసిన తర్వాత కూడా లోకేష్ మాటతీరులో ఎలాంటి మార్పు రాలేదంటే తెచ్చుకున్న గాంభీర్యమే కానీ మరోటి కాదని అర్థ‌మైపోతోంది. మరిలా ఎంతకాలం నెట్టుకొస్తారో చూడాల్సిందే. ఎందుకైనా మంచిదని సీనియర్లలో చాలామంది లో ప్రొఫైల్ మైన్ టెన్ ఎందుకు చేస్తున్నారో కూడా లోకేష్ అర్థం చేసుకోలేకపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.


Tags:    
Advertisement

Similar News