రూ.20లకే కేజీ టమోట.. ఎక్కడో తెలుసా?

ఏపీలో భారీగా పడిపోయిన టమోట ధరలు

Advertisement
Update:2024-10-12 15:54 IST

టమోట, ఉల్లిగడ్డ నిన్నటి వరకు పోటీ పడి పరుగులు పెట్టాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ధరల్లో నువ్వా.. నేనా అన్నట్టు పోటీ పడుతూనే ఉన్నాయి. కానీ ఒక చోట మాత్రం టమోటాల ధర అమాంతం పడిపోయింది. ఇప్పుడు అక్కడ కేజీ టమోటాల ధర ఎంతో తెలుసా.. జస్ట్‌ 20 రూపాయలే. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఒకవైపు టామోటాల ధర సెంచరీకి చేరువైతే రూ.20కే కేజీ ఎలా ఇస్తారా అని బుర్ర బద్దలు కొట్టుకోకండి.. ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూల్‌ జిల్లా పత్తికొండ మార్కెట్ లో కేజీ టమోట ధర రూ.20 మాత్రమే పలికింది. పత్తికొండ, ఆదోని, ఆలూరు సమీప ప్రాంతాల్లో టమోట పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఒక్క కర్నూల్‌ జిల్లాలోనే సుమారు 50 వేల ఎకరాల్లో టమోట పండిస్తున్నారు. దసరా పండుగ పూట మార్కెట్‌ కు టమోట పోటెత్తడంతో ట్రేడర్లు, వ్యాపారులు కలిసి ఒక్కసారిగా ధర తగ్గించేశారు. టమోట ధరలు భారీగా పెరగడంతో ఏపీ ప్రభుత్వం రైతుబజార్‌లలో రూ.58కే కేజీ టమోట అమ్మాలని నిర్ణయించింది. అకాల వర్షాలతో టమోట పంటకు నష్టం వాటిల్లిందని.. కేవలం వారం రోజులు మాత్రమే మంచి ధర పలికిన టమోట.. అంతలోనే భారీగా పడిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News