థాంక్యూ సోమచ్ మావయ్యా.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు కానీ, చంద్రబాబు ట్వీట్ లో ఎక్కడా తారక్ పేరు కానీ, రామ్ చరణ్ పేరు కానీ మెన్షన్ చేయలేదు. ఆయన కేవలం కీరవాణి, రాజమౌళి పేర్లు మాత్రమే ట్వీట్ లో పెట్టారు.

Advertisement
Update:2023-01-11 15:27 IST

మీడియా, సోషల్ మీడియా అంతా ఈరోజు నాటు-నాటు జపం చేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో అందరూ దర్శకుడు రాజమౌళిని, అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణిని తెగ పొడిగేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు వేసిన ఓ ట్వీట్, దానికి ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లై ఆసక్తికరంగా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ టీమ్ ని మెచ్చుకుంటూ తెలుగు భాషకు మరింత గౌరవాన్ని పెంచారంటూ చంద్రబాబు ట్వీట్ వేశారు. థాంక్యూ సోమచ్ మావయ్యా అంటూ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. టీడీపీ అనుకూల మీడియాలో ఎన్టీఆర్ రిప్లైని హైలెట్ చేస్తున్నారు. టీడీపీ అభిమానులు కూడా తారక్ మావాడే.. చూశారా మామా అల్లుళ్ల మధ్య బంధం అంటూ కొటేషన్లు పెడుతున్నారు.


అల్లుడి పేరు మెన్షన్ చేయని మావయ్య..

ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు కానీ, చంద్రబాబు ట్వీట్ లో ఎక్కడా తారక్ పేరు కానీ, రామ్ చరణ్ పేరు కానీ మెన్షన్ చేయలేదు. ఆయన కేవలం కీరవాణి, రాజమౌళి పేర్లు మాత్రమే ట్వీట్ లో పెట్టారు. తెలుగు భాష గొప్పతనం గురించి తానింతకు ముందే చెప్పానని, భారత్ కి ఈ అవార్డు రావడానికి ఇప్పుడు తెలుగే కారణం అయిందని అన్నారు చంద్రబాబు. అయితే తారక్ పేరుని ఆయన మెన్షన్ చేయకపోవడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ సానుభూతి పరులు.. ఇక్కడ కూడా వివక్ష ఏంటయ్యా అంటూ నిందిస్తున్నారు, నిలదీస్తున్నారు. ఎన్టీఆర్ పేరెత్తడం కూడా చంద్రబాబుకి ఇష్టం లేదంటున్నారు.

మోసేసిన మోదీ..

అవకాశం వస్తే చాలు సినిమా యాక్టర్లని మోసేసే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ జపం చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుపై ఆయన ట్వీట్ వేశారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ కి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు మోదీ. దీనికి కూడా తారక్ రిప్లై ఇచ్చారు. థాంక్యూ సర్, హానర్డ్ అంటూ బదులిచ్చారు. మొత్తమ్మీద చంద్రబాబు, ఎన్టీఆర్ పేరు మెన్షన్ చేయకుండా ట్వీట్ వేయడం, దానికి తారక్ రిప్లై ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.



Tags:    
Advertisement

Similar News