మీదే భారం.. గవర్నర్ ని కలసిన జగన్

టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు జగన్, గవర్నర్ ని కలిశారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

Advertisement
Update:2024-07-21 21:05 IST

మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన వరుస సంఘటనలపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులను ఆపే విధంగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు జగన్, గవర్నర్ ని కలిశారని వైసీపీ వర్గాలు తెలిపాయి.


వీడియోలు, ఫొటోలు..

వినుకొండ ఘటనతోపాటు ఇటీవల కాలంలో జరిగిన వివిధ సంఘటనల ఫొటోలు, వీడియో సాక్ష్యాలను కూడా గవర్నర్ కి చూపించి మరీ కూటమి ప్రభుత్వంపై జగన్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. ఆ తర్వాతి రోజు జరిగే సమావేశాలకు వైసీపీ టీమ్ హాజరు కాదని తెలుస్తోంది. మంగళవారం వైసీపీ నేతలంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు, బుధవారం ఢిల్లీలో ధర్నా చేపడతారు.

కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఘటనలపై అన్ని రకాలుగా జగన్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. బాధితుల్ని నేరుగా కలసి వారికి ఓదార్పునిస్తూనే మరోవైపు ధర్నాలు, నిరసనలకు పిలుపునిస్తున్నారు. అసెంబ్లీలో నిరసన తెలపడంతోపాటు, అటు పార్లమెంట్ లో కూడా వైసీపీ ఎంపీలు.. ఏపీ సమస్యలను ప్రస్తావించాలని సూచించారు జగన్. ఇక ఢిల్లీ ధర్నాతో జాతీయ స్థాయిలో ఏపీ సమస్యలను హైలైట్ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ ని కలసి కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు జగన్. 

Tags:    
Advertisement

Similar News