యాగాలు, పూజలనే నమ్ముకున్నారా..?
మళ్ళీ అధికారం అందుకోవాలంటే యాగాలు, పూజలు చేయాలని జ్యోతిష్యుడు చెప్పినట్లున్నారు. అందుకనే ఆయన చెప్పినట్లు యాగాలు, పూజలు మొదలుపెట్టారు.
అధికారంలోకి రావటానికి చంద్రబాబు నాయుడు చివరకు యాగాలు, పూజలనే నమ్ముకున్నట్లున్నారు. ఉండవల్లి కరకట్ట మీద తానుంటున్న అక్రమ నిర్మాణంలో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు యాగాలు, పూజలు మొదలుపెట్టారు. యాగాలు, పూజలు నిర్విఘ్నంగా జరగటానికి వీలుగా నేతలను మూడురోజులు పాటు తనను కలవద్దని చెప్పారు. కాకపోతే అవసరమైన కొద్దిమంది సీనియర్లను మాత్రమే యాగంలో పాల్గొనేందుకు రమ్మని ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావటమే చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఊహించని రీతిలో స్కిల్ స్కామ్ లో అరెస్టయి జైలుకు వెళ్ళారు.
సో, కేసుల నుండి బయటపడటంతో పాటు మళ్ళీ అధికారం అందుకోవాలంటే యాగాలు, పూజలు చేయాలని జ్యోతిష్యుడు చెప్పినట్లున్నారు. అందుకనే ఆయన చెప్పినట్లు యాగాలు, పూజలు మొదలుపెట్టారు. చంద్రబాబు దంపతులతో పాటు నారా లోకేష్, బ్రాహ్మణి కూడా పాల్గొంటున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడే భువనేశ్వరి జ్యోతిష్యుడిని కలిశారట. అప్పుడే యాగాలు, పూజల గురించి చెప్పారని పార్టీవర్గాల సమాచారం. అందుకనే బెయిల్ పై బయటకు రాగానే భార్యతో కలిసి చంద్రబాబు పుణ్యక్షేత్రాలు దర్శించింది.
తాజాగా మొదలైన క్రతువులో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధిచండీ యాగం, సుదర్శన నరసింహ యాగం, గణపతి హోమం, వాస్తు పూజలు కూడా చేయబోతున్నట్లు తెలిసింది. మామూలుగా అయితే చంద్రబాబుకు దైవభక్తి తక్కువే. ఏ గుడికి వెళ్ళినా, పూజలు చేసినా అవసరార్థమే కానీ మనఃపూర్వకంగా ఉండవు. ఎందుకంటే చంద్రబాబుకు సెంటిమెంట్లు అంటూ ఏమీలేవు. ఉన్నదంతా అధికారంపై వ్యామోహమే. అధికారం అందుకోవటానికి ఏమి చేయటానికైనా సిద్ధపడతారని అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్నది. బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నది.
బహుశా పవన్ తో పాత్తు లాభిస్తుందని చంద్రబాబు అనుకున్నట్లు లేరు. అందుకనే దైవబలం, గ్రహానుకూలం కోసం యాగాలు, పూజలు మొదలుపెట్టారు. చంద్రబాబు మీద నమోదైన ఆరు కేసులు ఎప్పటికి తేలుతాయో తెలీదు. ఏ కేసులో ఎప్పుడు అరెస్టయి మళ్ళీ జైలుకు వెళ్ళాల్సొస్తుందో అనే టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోంది. అందుకని అన్నింటి నుండి ఉపశమనం కోసం యాగాలు, పూజలు చేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.