పవన్ కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయారా..?
లక్ష కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారనేందుకు హరి దగ్గర ఏమి ఆధారాలున్నాయో తెలీదు. అసలు పవన్ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత..? కడుతున్న ట్యాక్స్ ఎంత..? జనాలకు పంచిపెడుతున్నదెంత..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. పార్టీ సమావేశంలో హరి మాట్లాడుతూ పవన్ సంపాదించిన కోట్లాది రూపాయలు జనాలకు పంచి పెట్టేస్తున్నారని చెప్పారు. రైతాంగానికి అండగా నిలబడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. చివరకు ఆదాయపు పన్ను కట్టడానికి పవన్ దగ్గర డబ్బు లేకపోతే రు. 5 కోట్లు అప్పు చేసినట్లు చెప్పారు. పవన్ చేసిన 5 కోట్ల రూపాయల అప్పుకు తానే సాక్ష్యమని కూడా అన్నారు.
ఒకవైపు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తుంటే మరోవైపు తాను సంపాదించినదంతా పంచిపెట్టేస్తున్న వ్యక్తి పవన్ అని హరి చెప్పారు. అంటే హరి చెప్పిందేమంటే పవన్ సీఎం అయితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని. సంపాదించిందంతా పవన్ పంచిపెట్టేస్తున్నారనేందుకు ఆధారాలు లేవు. అలాగే లక్ష కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారనేందుకు హరి దగ్గర ఏమి ఆధారాలున్నాయో తెలీదు. అసలు పవన్ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత..? కడుతున్న ట్యాక్స్ ఎంత..? జనాలకు పంచిపెడుతున్నదెంత..?
ఇన్ని ప్రశ్నలు కూడా అవసరంలేదు. ఒక్కో సినిమాకు పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో నిజాయితీగా హరిప్రసాద్ అగ్రిమెంటును చూపించగలరా..? పవన్ తన ఆదాయాన్నంతా పంచిపెట్టేస్తున్నట్లు హరి చెబుతున్నదంతా కథలని అందరికీ తెలుసు. పవన్ ఇమేజిని ఆకాశమంత పెంచేయటం కోసం జగన్ను దోపిడీదారుగా ప్రచారం చేస్తున్నారు.
జగన్ లక్ష కోట్లరూపాయలు దోచుకున్నది నిజమే అయితే ఆ విషయాన్ని రుజువు చేసి శిక్ష పడేట్లు చేస్తే జనాలు మెచ్చుకుంటారు. తప్పుచేసిన వాళ్ళు ఎంతటి వారైనా సరే వదలాల్సిన అవసరంలేదు. కానీ జగన్ లక్షకోట్లు దోచుకున్నారనే ఆరోపణలను జనాలెవరూ నమ్మటంలేదని హరిప్రసాద్ కు ఇంకా అర్థం కావటంలేదు. ఎందుకంటే గడచిన 13 ఏళ్ళుగా జగన్ పైన ఇవే ఆరోపణలు చేస్తున్నా ఒక్కటీ నిరూపణ కాలేదు.