గో బ్యాక్ బాబు.. పీలేరులో భారీగా ఫ్లెక్సీలు..
జైలులో ఉన్న టీడీపీ కార్యకరక్తల్ని పరామర్శించేందుకు చంద్రబాబు వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు స్థానికంగా హాట్ టాపిక్ అయ్యాయి.
సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ చంద్రబాబు.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ యాత్రలు చేస్తున్నారు. అయితే చంద్రబాబే పెద్ద సైకో అని, ఆయన పుంగనూరులో మతకలహాలు సృష్టిస్తున్నారని కొంతమంది పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సైకో చంద్రబాబు గో బ్యాక్.. అంటూ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడి అంటూ కొన్ని సంఘటనలకు సంబంధించిన ఫొటోలను కూడా ఫ్లెక్సీలలో ప్రింట్ చేసి పెట్టారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఈ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరు రైల్వే ట్రాక్ వద్ద ఈ ఫ్లెక్సీలను పెట్టారు.
పీలేరు సబ్ జైల్ కు ఈరోజు చంద్రబాబు వెళ్తున్నారు. జైలులో ఉన్న పుంగనూరు టీడీపీ కార్యకర్తలను ఆయన పరామర్శిస్తారు. ఈ నెల 7వ తేదీన రొంపిచర్లలో చల్లా బాబు ఫ్లెక్సీలను చింపడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాయి. అక్కడ టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవ తర్వాత వైసీపీ కార్యకర్తల ఫిర్యాదుతో కేసు నమోదైంది. హత్యాయత్నం సహా పలు సెక్షన్లు జోడించి టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. మొత్తం 8మందిని ఈనెల 10వతేదీన పీలేరు సబ్ జైలుకి రిమాండ్ కి తరలించారు.
చిత్తూరు జిల్లాలో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించామంటున్న మంత్రి పెద్దిరెడ్డి, కుప్పంలో కూడా చంద్రబాబుని ఓడించి తీరుతామంటున్నారు. ఇటీవల కుప్పంలో వైసీపీ హవా పెరిగిందని, స్థానిక ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనం అంటున్నారు. దీంతో కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెంచారు. అదే సమయంలో పెద్దిరెడ్డిపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో పుంగనూరు కేంద్రంగా టీడీపీ, వైసీపీ పోరు పెరిగింది. రొంపిచర్లలో జరిగిన దాడి తర్వాత అది మరింత ముదిరింది. అయితే ఆ దాడికి కారణం మీరంటే మీరంటూ రెండు పార్టీల నేతలు ఆరోపించుకుంటున్నారు. జైలులో ఉన్న టీడీపీ కార్యకరక్తల్ని పరామర్శించేందుకు చంద్రబాబు వస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు స్థానికంగా హాట్ టాపిక్ అయ్యాయి.