నల్లమల ఫారెస్ట్ లేదా అంతర్జాతీయ సముద్ర జలాల్లోకైనా మేం రెడీ
ఫైటింగ్‌లో చంద్రబాబు చచ్చినా.. ఒకవేళ తాము చచ్చి చంద్రబాబు జైలుకు వెళ్లినా రాష్ట్రానికి పట్టిన పీడ వదులుతుందన్నారు. పొద్దుపోని మాటలు మాట్లాడుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారన్నారు.
చంద్రబాబు పిలిస్తే వెళ్లి కొట్టుకునేందుకు తాను సిద్ధమేనని చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని. ఈ మధ్య ఖాళీగా ఉండి బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూస్తున్న చంద్రబాబు పదేపదే సినిమా డైలాగులు చెబుతూ తేల్చుకుందాం రండి అంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ బీజీగా ఉంటారు కాబట్టి ఆయన రారని.. కావాలంటే ప్లేస్ చెబితే తాను, వల్లభనేని వంశీ వస్తామన్నారు. ఇక్కడే అయితే పోలీసులు అడ్డుకుంటారని.. రహస్యంగా నల్లమల ఫారెస్ట్‌లోకి గానీ.. బందరు వైపు అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి పడవల్లో వెళ్లి గానీ కొట్టుకుందామని కొడాలి ఆహ్వానించారు.
ఫైటింగ్‌లో చంద్రబాబు చచ్చినా.. ఒకవేళ తాము చచ్చి చంద్రబాబు జైలుకు వెళ్లినా రాష్ట్రానికి పట్టిన పీడ వదులుతుందన్నారు. పొద్దుపోని మాటలు మాట్లాడుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారన్నారు. గూగుల్ టేకౌట్ ద్వారా వివేకా హత్యకు ముందు నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు గుర్తించామని సీబీఐ చెప్పడంపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. ఈ మాత్రం దానికి సీబీఐ ఎందుకు.. ఒక టెలిఫోన్ ఆపరేటర్‌కు అప్పగించి ఉంటే ఈ రిపోర్టు అప్పుడే పది రోజుల్లోనే ఇచ్చేవాడన్నారు. ఈ మాత్రం దాని కోసం నాలుగేళ్లుగా సీబీఐ గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతూ ఉందా అని ప్రశ్నించారు.
వివేకా ఇల్లు, భాస్కర్ రెడ్డి ఇల్లు దగ్గర దగ్గరగానే ఉంటాయని.. అక్కడున్న ఫోన్లు ఒకే లోకేషన్ చూపడంలో ఆశ్చర్యం ఏముందన్నారు. ఆదినారాయణరెడ్డి, వివేకా బామ్మర్ది లాంటి వారి ఫోన్లు మాత్రం ఎక్కడున్నాయో దర్యాప్తు చేయకుండా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. గూగుల్ టేకౌట్ అంటూ సీబీఐ సాధించింది ఏమీ లేదన్నారు.