ఏమి లెగ్గుల్రా స్వామి?!.. పగలబడి నవ్విన మాజీ మంత్రి అనిల్
తండ్రి పాదం పెడితే మనుషులు చచ్చిపోతున్నారు. కొడుకు పాదం పెడితే నందమూరి ఫ్యామిలీ ఆసుపత్రి పాలైపోయింది. ఏం పాదాలు రా స్వామి? అంటూ మాట్లాడారు.
ఏపీ రాజకీయాల్లో సున్నితత్వం రాను రాను తగ్గిపోతోంది. సంయమనం పాటించాల్సిన అంశాల్లోనూ ఇరు పార్టీలు అవహేళనగా మాట్లాడుకునే స్థాయికి ఏపీ రాజకీయాలు వచ్చేశాయి. ఇప్పుడు వైసీపీకి ఛాన్స్ వచ్చింది.
నారా లోకేష్ పాదయాత్ర మొదలైన తొలిరోజే నటుడు తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలవడంతో వైసీపీ నేతలు లోకేష్ పై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. " ఏమి పాదాల్రా బాబు మీవి?" అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పగలబడి మీడియా సమావేశంలో నవ్వేశారు.
తండ్రి పాదం పెడితే మనుషులు చచ్చిపోతున్నారు. కొడుకు పాదం పెడితే నందమూరి ఫ్యామిలీ ఆసుపత్రి పాలైపోయింది. ఏం పాదాలు రా స్వామి? అంటూ మాట్లాడారు. లోకేష్ అడుగుపెట్టంగానే నందమూరి ఫ్యామిలీలో ఒకడికి స్టంటు పడిందన్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొని నందమూరి వారి పార్టీని కాస్త నారావారి పార్టీగా మార్చేయడంతోపాటు.. అదే నందమూరి ఫ్యామిలీలోని వారిని వెనుక తోకల్లా తిప్పుకుంటూ.. పాపం వెంట వచ్చినందుకు వారిని పైకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అనిల్ కుమార్ సెటైర్లు వేశారు.
ఈమధ్య ఎవరికైనా పదవి ఊడిపోతే చంద్రబాబు నాయుడుని కలిశాడా అని ఆరా తీసుకుంటున్నారని.. అలా పరిశీలిస్తే ఓ వారం రోజులు ముందు పదవి ఊడిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడుని కలిసే ఉంటారని నిర్ధారణ అవుతోందని అనిల్ కుమార్ చెప్పారు.
అలాంటి చంద్రబాబు నాయుడు లోకేష్ పాదయాత్రకు బయలుదేరుతుంటే ఎదురు వచ్చారని అందుకే తొలి రోజు తారకరత్న అలా అయిపోయారని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టేముందు ముతైదువు ఎదురు రావాల్సిందిగా కోరుతారని, లోకేష్ మాత్రం తన తండ్రి ఎదురు రాగా పాదయాత్రకు బయలుదేరాడని అందుకే ఈ విపరీతాలు జరుగుతున్నాయన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఒక సింహం అని, కుందేలు సింహం మీద పడితే ఎలా ఉంటుందో.. నారా లోకేష్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. హ్యాపీగా ఓ ఆరు నెలలు పాదయాత్రను ఎంజాయ్ చేసేయ్.. ఎన్నికలు వస్తాయి ఆ తర్వాత నువ్వు, మీ నాన్న హైదరాబాదులో కూర్చొని చెమ్మ చెక్క అంటూ పాటలు పాడుకుందురు గాని అని అనిల్ కుమార్ యాదవ్ సెటైర్ వేశారు.