ఎస్ఐపీబీ తొలి సమావేశం..10 పరిశ్రమలకు అనుమతులు
ఏపీలో 33,966 ఉద్యోగాలు కల్పించేందుకు రూ. 85 వేల కోట్లు పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది
ఏపీ సీఎం చంద్రబాబు నేతత్వంలో ఇవాళ రాష్ట్ర సెక్రేరియట్‌లో ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్)కి సంబంధించి తొలి సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంవోయూలు, ఒప్పందాల పురోగతి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. గతంలో జరిగిన వివిధ ఒప్పందాలను, వాటి ప్రస్తుత స్థితిగతులను కూడా సమీక్షించారు. ఈ సమావేశంలో రూ,85 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. 33,966 వేల ఉద్యోగాలు కల్పించే 10 పరిశ్రమలకు అనుమతుల మంజూరు, భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు.
అయితే భారీ పరిశ్రమల ఏర్పాటుకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా.. అదే సంస్థలో ఉద్యోగ, ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సాకారం చేసేలా ఒప్పందాలను నిత్యం ట్రాక్ చేయాలని ఉన్నతాధికారులకు సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.