ఏపీ డీజీపీ రేసులో ఆ ముగ్గురు

ప్రస్తుతం డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ ఆదివారం బదిలీ వేటు వేసింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Update:2024-05-06 11:01 IST

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై ఈసీ బదిలీ వేటుతో కొత్త డీజీపీ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రేసులో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమల రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్‌లు సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

అంజనా సిన్హా 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌. ప్రస్తుతం ఆమె రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక మాదిరెడ్డి ప్రతాప్‌ 1991 బ్యాచ్‌కు చెందిన అధికారి. ఈ ముగ్గురిలో ఒకరిని ఏపీ డీజీపీగా నియమిస్తారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ ఆదివారం బదిలీ వేటు వేసింది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుతో ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని సూచించింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీ పోస్టు కోసం డీజీ హోదా గల ముగ్గురి పేర్లతో ప్యానల్ పంపాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది ఈసీ. ఇవాళ సాయంత్రంలోగా ఏపీ డీజీపీ ఎవ‌ర‌న్న‌ది క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News