వరద సమయంలో ఉద్యమస్ఫూర్తితో ముందుకెళ్లాం

సీఎం సహాయనిధికి రూ. 400 కోట్లు రావడం ఒక చరిత్ర అన్న చంద్రబాబు

Advertisement
Update:2024-09-25 12:19 IST

వరద సమయంలో అందరం కలిసి ఉద్యమస్ఫూర్తితో ముందుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలో వరద బాధితులకు ఆర్థికసాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ద ఎత్తున విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పని చేయగలిగాం. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే.. మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను అని తెలిపారు. తక్కువ సమయంలో విపత్తు నుంచి బైటపడగలిగామని చెప్పారు.

విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు. సీఎం సహాయనిధికి రూ. 400 కోట్లు రావడం ఒక చరిత్ర. తనతో పాటు ఉద్యోగులంతా 11 రోజుల పాటు నిర్విరామంగా పనిచేశామని చంద్రబాబు చెప్పారు. వరద నీటిలో బాధితులకు అన్నిరకాల సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు. 

Tags:    
Advertisement

Similar News