అహంకారం గురించి మాట్లాడేది నువ్వా.. పవన్‌ కల్యాణ్‌..?

నేను నిర్ణయాలు తీసుకుంటాను, మీరు నా వెంట రావాలి అని ప‌వ‌న్‌ అంటున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్షం కూడా.

Advertisement
Update:2024-03-04 17:39 IST

మైక్‌ కనిపిస్తే చాలు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఊగిపోతారు. ఏం మాట్లాడుతారో కూడా ఆయనకే తెలియదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అహంకారమని నోరు పారేసుకుంటారు. పవన్‌ కల్యాణ్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ఆయనకు రాజకీయ పరిణతి లేదని అందరికీ తెలుసు. ఆయన వేస్తున్న కుప్పిగంతులు, చేస్తున్న ప్రసంగాలు ఆ విషయాన్ని పట్టిస్తాయి. కానీ, పవన్‌ కల్యాణ్‌కు అహంకారం కూడా తీవ్ర స్థాయిలోనే ఉంది.

ఇటీవల జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి సభలో ఆయన కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి అన్న మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తాయి. నాయకుడనేవాడు తనతో విభేదించేవారిని కూడా తనతో నడిపించుకుని వెళ్లగలిగేంత‌ పరిపక్వతతో వ్యవహరించాలి. కానీ, ఆయన తన పార్టీ కార్యకర్తలను, తన శ్రేయస్సును ఆశిస్తున్నవారిని చులకన చేసి మాట్లాడారు.

నేను నిర్ణయాలు తీసుకుంటాను, మీరు నా వెంట రావాలి అని ప‌వ‌న్‌ అంటున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్షం కూడా. టీడీపీతో పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లే దక్కించుకోవడంపై, తన పార్టీ బలంగా ఉన్న సీట్లను వదిలేసి బలహీనంగా ఉన్న సీట్లను తీసుకోవడంపై ఆయన హేతుబద్ధ‌మైన వాదన చేయలేదు. పైగా, అందరూ తనను అనుసరించాలని చెప్పారు. ఆ మాటలను కొంత గట్టిగా కూడా వల్లె వేశారు. తన వెంట వచ్చేవారే తనవారని ఆయన అన్నారు.

ఉమ్మడి నిర్ణయాలకు జనసేనలో తావు లేదు. భిన్నాభిప్రాయానికి చోటు లేదు. ప‌వ‌న్ ఒక్కడే అన్నీ అయి వ్యవహరిస్తారు. తన వల్లనే జనసేస ఏదో సాధిస్తుందని చెబుతారు. ఇదంతా తనకు ఎక్కడలేని బలం ఉందనే అహంకారం తప్ప మరోటి కాదు.

Tags:    
Advertisement

Similar News