ఆడబిడ్డల జోలికొస్తే ఖడడ్దార్‌

గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డ ఏపీ సీఎం

Advertisement
Update:2024-11-20 14:00 IST

గతంలో ఎన్నడూ లేనివిధంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై ఎంత తవ్వితే అంత భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఒక్కో ఇటుకా పేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు.

వైసీపీ ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారు. ఆడబిడ్డల జోలికొస్తే ఖడడ్దార్‌.. ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతాం. పిల్లలకు కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నని చంద్రబాబు చెప్పారు.

విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వ అప్పులు, తప్పులు ఈ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయన్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలమనే నమ్మకం ఉన్నదా? అని కొందరు అడిగారు. నేను పారిపోను. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసమే పనిచేశాను. ఇప్పుడూ అలాంటి సవాల్‌ను స్వీకరించి మళ్లీ ప్రజలను నిలబడతానని చెప్పాను. అది చేసి తీరుతానని ముందుకు వచ్చాను. 21 మంది ఎంపీలతో ఢిల్లీలో మన పరపతి పెరిగింది. ఒక్కో ఇటుకా పేరుస్తూ ముందుకు వెళ్తున్నాం. రాత్రికి రాత్రే ఏదీ సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రజలకు తెలియజేయాలి. అంకితభావంతో పనిచేస్తూ రాజీ లేకుండా ముందుకెళ్తామని చంద్రబాబు అన్నారు. 

Tags:    
Advertisement

Similar News