శ్రీవారి దర్శనార్థం కాలినడక వచ్చే భక్తులూ.. ఈ జాగ్రత్తలు పాటించండి

తిరుమలకు వచ్చే భక్తుల్లో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన

Advertisement
Update:2024-10-26 09:15 IST

శ్రీవారి దర్శనార్థం కాలినడక మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల్లో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో భక్తులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, షుగర్‌, హైబీపీ, ఊబకాయం, ఉబ్బసం, మూర్చ, కీళ్ల, గుండె సంబంధిత వ్యాధులున్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం శ్రేయస్కరం కాదు. తిరుమల సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న కారణంగా ఆక్సిజన్‌స్థాయి తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారి మందులు వెంట తెచ్చుకోవాలి. కాలినడకన వచ్చే భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలో 1,500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం తీసుకోవచ్చు. తిరుమలలోని అశ్విని హాస్పటల్‌, ఇతర ఆస్పత్రుల్లో 24 గంటలూ వైద్యసాయం అందిస్తారు. కిడ్నీల సమస్య బాధితులు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ సౌకర్యం పొందవచ్చని టీటీడీ పేర్కొన్నది. 

Tags:    
Advertisement

Similar News