బిగ్‌బాస్ షో ర‌ద్దుపై హైకోర్టును ఆశ్ర‌యించిన సీపీఐ నారాయ‌ణ‌

బిగ్‌బాస్ షోపై తెలంగాణలో కంప్ల‌యింట్ చేసినా కోర్టులు సైతం కేసును తీసుకోక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసును తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
Update:2022-11-23 13:12 IST

CPI నాయ‌కుడు నారాయ‌ణ మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. `మా టీవీ`లో నాగార్జున వ్యాఖ్యాత‌గా వ‌స్తున్న ప్ర‌ముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌పై గ‌తంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన నారాయ‌ణ, ఈసారి ఏకంగా బిగ్‌బాస్ షోను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. బిగ్ బాస్ షోని రద్దు చేసేంత వరకూ న్యాయ పోరాటం చేస్తానని భీష్మించారు. బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున సహా పలువురికి ఇప్ప‌టికే నోటీసులు పంపించినట్టు నారాయణ మీడియాకు వెల్లడించారు. బిగ్‌బాస్ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని, ప్ర‌జ‌ల‌కు పైసా ప్ర‌యోజ‌నం లేని ఈ షో ప‌క్కా వ్యాపారాత్మ‌క‌మ‌ని విమ‌ర్శించారు. షో నిర్వహిస్తున్న జ్యురిషిడిక్ష‌న్ తెలంగాణ‌లో ఉంద‌ని, బిగ్‌బాస్ షోపై తెలంగాణలో కంప్ల‌యింట్ చేసినా కోర్టులు సైతం కేసును తీసుకోక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసును తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News