తండ్రిని తలుచుకుంటూ జగన్ భావోద్వేగ ట్వీట్..!

వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళి అర్పించారు. జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైయస్సార్ కు ఘన నివాళులు అర్పించారు.

Advertisement
Update:2022-09-02 10:16 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు, పలు పార్టీల నాయకులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలు వాడవాడలా రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళి అర్పించారు. జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైయస్సార్ కు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా తన తండ్రి ని తలుచుకుంటూ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ' నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలాగే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధాన అంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది' అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వైయస్సార్ ను గుర్తు చేసుకున్నారు. ' రైతు బాంధవుడు, పేదల గుండెచప్పుడు, సంక్షేమ పాలన కు మారుపేరు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆ మరపురాని మహానేతకు ఘన నివాళులు అర్పిస్తున్నా' అని ట్వీట్ చేశారు. మంత్రి రోజా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తదితరులు ట్విట్టర్ వేదికగా వైయస్సార్ ను గుర్తు చేసుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Tags:    
Advertisement

Similar News