దసరా కాదు డిసెంబరే.. జగన్ అధికారిక ప్రకటన

‘త్వరలోనే విశాఖకు షిఫ్ట్‌ అవుతున్నాను. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుంది. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాం. డిసెంబర్‌ లోపు విశాఖకు మారుతాను.’ అని అన్నారు జగన్.

Advertisement
Update:2023-10-16 13:46 IST

విశాఖ రాజధాని తరలింపు ముహూర్తం డిసెంబర్ కి మారింది. ఆమధ్య దసరాకల్లా కాపురం మార్చేస్తానన్న సీఎం జగన్, ఇప్పుడు కొత్త ముహూర్తాన్ని తానే స్వయంగా ప్రకటించారు. ఈ ఏడాది చివరినాటికి విశాఖ నుంచి పాలన మొదలవుతుందని స్పష్టం చేశారు. ‘త్వరలోనే విశాఖకు షిఫ్ట్‌ అవుతున్నాను. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుంది. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాం. డిసెంబర్‌ లోపు విశాఖకు మారుతాను.’ అని అన్నారు జగన్.


Full View

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఈ రోజు జగన్ పర్యటిస్తున్నారు. మొత్తం రూ.1,624 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఐటీ, ఫార్మా కంపెనీలకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ నిర్వహించారు. ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన జగన్.. హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్‌ గా మారబోతోందని చెప్పారు. రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరం అని, ఇప్పటికే ఇది ఎడ్యుకేషన్‌ హబ్‌ గా తయారైందని, ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజనీర్లు ఇక్కడి నుంచి తయారవుతున్నారని చెప్పొరు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయిని, ఆయా కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్‌ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తామన్నారు జగన్.

జీవీఎంసీ ఆధ్వర్యంలో బీచ్‌ క్లీనింగ్‌ మిషన్లను కూడా సీఎం జగన్ ప్రారంభించారు. పరవాడ ఫార్మా సిటీలో యుజియా స్టెర్లీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ను జగన్ ప్రారంభించారు. లారెస్‌ ల్యాబ్‌ లో యూనిట్‌–2ను కూడా జగన్ ప్రారంభిస్తారు. సాయంత్రం ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. ఈ పర్యటనలో పారిశ్రామిక ప్రారంభోత్సవాల సంగతి అటుంచితే.. డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన అనేది హైలైట్ గా మారింది.

Tags:    
Advertisement

Similar News