శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆంజజేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయంలోకి ప్రవేశించారు. ముందుగా ఆలయ మర్యాదల ప్రకారం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఆలయ ఈవో శ్యామలరావు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో లడ్డూకి పరీక్షలు నిర్వహించగా.. కల్తీ జరిగినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరపాలని నిర్ణయించారు. అందులోభాగంగా సర్వ శ్రేష్ట త్రిపాఠి సారథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై టీటీడీ బోర్డ్ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.