పులివెందులలో గెలువు చాలు... జగన్ కి బాబు సవాల్

సీఎంగానే తిరిగి అసెంబ్లీకి వస్తానంటూ గతంలో సవాల్ చేసిన చంద్రబాబు.. తిరిగి ఆ వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. విజయం సాధించి తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారాయన.

Advertisement
Update:2023-05-18 07:00 IST

పులివెందులలో గెలువు చాలు... జగన్ కి బాబు సవాల్

టీడీపీ, చంద్రబాబు.. వెంటిలేటర్ పై ఉన్నారని సీఎం జగన్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. విశాఖ జిల్లా పర్యటనలో వైసీపీపై విరుచుకుపడ్డారు. జగన్ పని, వైసీపీ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా గెలవరని అన్నారు. వైనాట్ కుప్పం, వైనాట్ 175 అంటూ వైసీపీ రెచ్చిపోతోందని.. అసలు జగన్, పులివెందులలో గెలిస్తే చాలని సెటైర్లు పేల్చారు. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా సైకో పోవడం ఖాయమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అప్పుడే అసెంబ్లీకి వస్తా..

సీఎంగానే తిరిగి అసెంబ్లీకి వస్తానంటూ గతంలో సవాల్ చేసిన చంద్రబాబు.. తిరిగి ఆ వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. విజయం సాధించి తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారాయన. రాష్ట్రం బాగుండాలంటే టీడీపీ తిరిగి అధికారంలోకి రావాలని, ఉద్యోగాలు, కంపెనీలు రావాలన్నా.. టీడీపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం మోసాలు, అక్రమాలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

విశాఖలో జై అమరావతి..

విశాఖ పర్యటనలో తన సభకు వచ్చినవారితో చంద్రబాబు జై అమరావతి అనే నినాదాలు చేయించారు. తమ్ముళ్లూ ఏపీ రాజధాని ఏది? అందరూ గట్టిగా చెప్పండి అంటూ పిలుపునిచ్చారు. జై అమరావతి అంటూ నినాదాలు చేయించారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీని గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్రం మొత్తంలో 23 సీట్లు రాగా విశాఖ నుంచే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారని గుర్తు చేశారు.

అద్దె ఇంట్లో ఉంటున్నా..

అమరావతిలో తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని, అది సొంతది కాదని.. దాన్ని కూల్చేందుకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఆ ఇంటికి అద్దె చెల్లిస్తున్నా క్విడ్ ప్రోకో అంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు. చివరకు జప్తు చేస్తామంటున్నారని చెప్పారు. జగన్ కి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తాడేపల్లి, కడప, ఇడుపులపాయ, పులివెందులలో ప్యాలెస్‌ లు ఉన్నాయన్నారు బాబు.

Tags:    
Advertisement

Similar News