జూ.ఎన్టీఆర్ ఫొటోలు కనబడకూడదు.. - క్యాడర్‌కు చంద్రబాబు ఆదేశం
మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నవారిని మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, ఆయన అనుచరులు చెదరగొట్టారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కృష్ణాజిల్లా పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి సెగ తగిలింది. బుధవారం చంద్రబాబు కార్యక్రమం సందర్భంగా విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫొటోలను అభిమానులు ప్రదర్శించారు.
అంతేకాకుండా చంద్రబాబు కాన్వాయ్ ఎదుట జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ అభిమానులు గట్టిగా నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. ఆ ఫొటోలను వెంటనే తీసేయాలని క్యాడర్‌ను ఆదేశించారు. మరోసారి ఆ ఫొటోలు కనబడకూడదని స్ట్రిక్ట్‌గా ఆదేశాలు జారీ చేశారు. నినాదాలు చేసినవారిని ఈడ్చిపడేయాలంటూ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో పెట్టుకున్న యువకుడిపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. మచిలీపట్నంలోని మూడు బొమ్మల సెంటర్‌లో జూనియర్ ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నవారిని మాజీ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర, ఆయన అనుచరులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తల నడుమ తోపులాటలు జరిగాయి.