చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?
పుంగనూరు ఘటనలో తమ నేతలు, క్యాడర్‌పై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేయటమే విచిత్రంగా ఉంది.
చేసింది తప్పుడు పని అని తెలిసినా, భారీ హింసా రాజకీయాలకు వేసిన స్కెచ్ బయటపడిన తర్వాత కూడా చంద్రబాబునాయుడు ఇంకా ఎదురు దాడులు చేస్తున్నారు. పోలీసులకే వాటర్నింగులు ఇస్తున్నారు. ఏలూరు రోడ్డుషోలో మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలో తమ నేతలు, క్యాడర్‌పై తప్పుడు కేసులు పెట్టే పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బ్లాక్ మెయిల్ చేయటమే విచిత్రంగా ఉంది. పోలీసులు తమ వాళ్ళపై అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
పుంగనూరు బైపాస్ రోడ్డు మీదగా చిత్తూరుకు వెళ్ళిపోవాల్సిన చంద్రబాబు సడెన్‌గా పుంగనూరు టౌన్లోకి ఎందుకు ఎంటరయ్యారనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానంలేదు. చంద్రబాబు పుంగనూరులోకి అడుగుపెట్టడం వల్లే అంగళ్ళు ప్రాంతంలో గంటలకొద్ది అల్లర్లయిన విషయం జనాలందరికీ అర్థమైంది. పోలీసులకు ఒక రూటు మ్యాప్ ఇచ్చి చంద్రబాబు మరో రూటులో పుంగనూరులోకి వచ్చింది గొడవలు సృష్టించటానికే అన్న విషయం అందరికి తెలిసిపోయింది. అనవసరంగా గొడవలు సృష్టించిన చంద్రబాబు బాగానే ఉన్నారు కానీ నమ్మినందుకు మధ్యలో నేతలు, క్యాడర్ కేసుల్లో బుక్కయిపోయారు.
సుమారు 200 మంది మీద కేసులు నమోదుకాగా 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ-టీడీపీ నేతల మధ్య గొడవలు జరిగి ఉంటే కథ వేరేవిధంగా ఉండేది. కానీ ఇక్కడ సమస్యంతా టీడీపీ నేతలు, క్యాడర్ సుమారు 20 మంది పోలీసులను తీవ్రంగా గాయపరిచి పోలీసులు వాహనాలను తగలబెట్టడమే. పోలీసులు నమోదు చేసిన కేసులు, చేసిన అరెస్టులన్నీ వీడియోల సాక్ష్యంగానే జరిగాయి. దాన్ని కూడా చంద్రబాబు తప్పుడు కేసులంటున్నారు.
టీడీపీ నేతల్లో కొందరి వాహనాల్లో రాళ్ళు, కర్రలు, తుపాకులు దొరికిన తర్వాత కూడా తమ నేతలు అమాయకులని, పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు బుకాయించటంలో అర్థమేలేదు. వీడియో సాక్ష్యాలతో దొరికిన తర్వాత కూడా పోలీసులు కేసులు పెట్టకుండా ఉంటారా? టీడీపీ అధికారంలోకి రాగానే ఓవర్ యాక్షన్ చేస్తున్న ప్రతి పోలీసు అధికారి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఓవర్ యాక్షన్ చేసింది తాను, తన నేతలు, క్యాడర్ అన్న విషయాన్ని మరచిపోయిన చంద్రబాబు పోలీసులకు వార్నింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.