హెల్త్ బులిటెన్ గుడ్.. మరి చంద్రబాబు సమస్య ఏంటి..?

ట్రీట్మెంట్ తర్వాత చంద్రబాబు బాగానే ఉన్నారని చెబుతున్నారు రాజమండ్రి జైలు అధికారులు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. జైలులో ఏదో జరిగిపోతోందని, ఆయన ఆరోగ్యం, భద్రతపై మొదటి నుంచీ తమకు ఆందోళన ఉందని అంటున్నారు.

Advertisement
Update:2023-10-13 10:56 IST

హెల్త్ బులిటెన్ గుడ్.. మరి చంద్రబాబు సమస్య ఏంటి..?

చంద్రబాబుకి జ్వరం లేదు, బీపీ సాధారణ స్థాయిలోనే ఉంది, పల్స్ రేటు బాగుంది, లంగ్స్ క్లియర్ గానే ఉన్నాయి, హార్ట్ ఓకే, ఫిజికల్ యాక్టివిటి గుడ్. రాజమండ్రి జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులిటెన్ తాజా విశేషాలివి. అంతా బాగానే ఉంది, మరి చంద్రబాబుకి వచ్చిన సమస్య ఏంటనేది తేలాల్సి ఉంది. ఇంత ఆరోగ్యంగా ఆయన లోపల ఉంటే, బయట ఉన్న కుటుంబ సభ్యులు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారనేది వైసీపీ నేతల ప్రశ్న. కేవలం సింపతీ కోసమే చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తున్నాయని అంటున్నారు.

చర్మసమస్యకి అంత హడావిడా..?

ఉష్ణోగ్రత పెరగడం, డీహైడ్రేషన్ వల్ల చంద్రబాబుకి చర్మ సంబంధిత అలర్జీ రావడంతో ఇద్దరు ప్రత్యేక వైద్యుల్ని రాజమండ్రి జైలుకి పిలిపించారు. ఆయనకి వైద్యం చేయించి వారిని పంపించి వేశారు. ట్రీట్మెంట్ తర్వాత చంద్రబాబు బాగానే ఉన్నారని చెబుతున్నారు రాజమండ్రి జైలు అధికారులు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. జైలులో ఏదో జరిగిపోతోందని, ఆయన ఆరోగ్యం, భద్రతపై మొదటి నుంచీ తమకు ఆందోళన ఉందని అంటున్నారు.

కక్షసాధింపు సాధ్యమేనా..?

జైలులో పెట్టడం కక్షసాధింపు అంటారు, జైలులో పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఎలా చేపడుతుంది అంటే సమాధానం లేదు. వేడినీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఫ్యాన్ ఇవ్వలేదని కొన్నిరోజులు వాదించారు.

ఇప్పుడు చంద్రబాబు బరువు తగ్గిపోయారని, అది ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు. జైలులో వసతులు కల్పించకుండా శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. అటు కోర్టుల్లో బెయులు రాకపోవడం, క్వాష్ పిటిషన్ సంగతి కూడా తేలకపోవడంతో చంద్రబాబు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ దశలో ఇలా కుటుంబ సభ్యులు సింపతీకోసం ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News