ఈ మాజీ మంత్రిని దూరం పెట్టేసినట్లేనా?

నంద్యాల జిల్లాలోని నంద్యాల, డోన్, ఆదోని నియోజకవర్గాల ఇన్‌చార్జిల‌తో పాటు ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు సమీక్ష చేశారు. అయితే ఇంత ఇంపార్టెంట్ మీటింగులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కనబడలేదు.

Advertisement
Update:2023-07-28 12:02 IST

తాజాగా జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అందరికీ అలాగే అనిపిస్తోంది. నంద్యాల జిల్లాలోని నంద్యాల, డోన్, ఆదోని నియోజకవర్గాల ఇన్‌చార్జిల‌తో పాటు ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు సమీక్ష చేశారు. పై నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలు, గెలవటానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలు తదితరాలపై సుదీర్ఘమైన చర్చ‌ జరిగింది. పార్టీ ముఖ్యనేతలు ఏవీ సుబ్బారెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, కేఈ ప్రతాప్, భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అయితే ఇంత ఇంపార్టెంట్ మీటింగులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కనబడలేదు. కారణం ఏమిటంటే ఆమెను ఆహ్వానించలేదని టాక్. అఖిలప్రియను ఈ మీటింగుకు దూరంపెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. కారణం ఏమిటంటే ఆమె వ్యవహారశైలితో బాగా విసిగిపోవ‌డ‌మే. ఎక్కడలేని వివాదాలు అఖిల మీదే ఉన్నాయి. భూకబ్జాలు, కిడ్నాపులు, డాక్యుమెంట్ల ఫోర్జరీ, దౌర్జన్యాలు, దాడులు, హత్యకు కుట్రల కేసుల్లో ఇరుక్కునున్నారు. కిడ్నాపు కేసులో అరెస్టయిన అఖిల బెయిల్‌పై బయట తిరుగుతున్నారు.

ఇన్ని వివాదాల్లో కూరుకుపోయిన అఖిలను పార్టీకి దూరంపెట్టాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే ఆ విషయాన్ని మాత్రం బహిరంగంగా ప్రకటించలేదు. ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న అఖిలను పార్టీలో ఏ నేత కూడా కలవటంలేదు. ఆళ్ళగడ్డలో వచ్చే ఎన్నికల్లో గెలుపు డౌటనే ఆమె కూడా నంద్యాలలో తిరుగుతున్నారు. నంద్యాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఆళ్ళగడ్డ విషయాన్ని చూసుకోమని చంద్రబాబు చెప్పినా అఖిల విన‌డంలేద‌ట!

నంద్యాలలో సొంతంగా పార్టీ ఆఫీస్ పెట్టుకుని తమ్ముడు జగద్విఖ్యాతరెడ్డిని వెంట తిప్పుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దాంతో మిగిలిన నేతలంతా గోల చేస్తున్నారు. ఆమె ప్రశాంతంగా ఉండకపోగా నేతల్లో ఎవర్నీ ప్రశాంతంగా ఉండనీయటంలేదట. ఆ మధ్య లోకేష్ పాదయాత్ర సందర్భంగా నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి మీద జరిగిన దాడి తర్వాత అఖిల మీద చంద్రబాబు యాక్షన్ తీసుకుంటారనే అనుకున్నారు. అయితే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే చంద్రబాబు ఉద్దేశంలో అఖిల తనంతట తానుగానే పార్టీని వదిలేసి వెళ్ళిపోవాలనేమో. ఆ విషయం గ్రహించే అఖిల కూడా పార్టీని వదిలిపెట్టకుండా కంపు చేస్తోంది. చివరకు పార్టీ మీటింగులకు పిలకపోయినా సరే ఆమె మాత్రం పార్టీలోనే ఉంటున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News