బాబు కేబినెట్ రెడీ.. ఏపీ మంత్రులు ఎవరెవరంటే..?

ముందే ఊహించినట్టుగా పవన్ కల్యాణ్ కి కీలకమైన డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ప్రస్తుతానికి ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. నారా లోకేష్ ని కూడా మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.

Advertisement
Update:2024-06-12 06:06 IST

ఏపీ మంత్రి వర్గం ఖరారైంది. చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 23మంది మంత్రులు ఈరోజు వారితోపాటే ప్రమాణ స్వీకారం చేస్తారు. టీడీపీ నుంచి చంద్రబాబుతోపాటు మొత్తం 20మంది కేబినెట్ లో ఉంటారు. జనసేన నుంచి పవన్ తోపాటు మొత్తం నలుగురికి అవకాశం వచ్చింది. బీజేపీ నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకుంటున్నారు. అంటే సీఎం కాకుండా కేబినెట్ లో మొత్తం 24మంది ఉంటారన్నమాట.

ముందే ఊహించినట్టుగా పవన్ కల్యాణ్ కి కీలకమైన డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ప్రస్తుతానికి ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. నారా లోకేష్ ని కూడా మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇక సీనియర్లతోపాటు, ఈసారి జూనియర్లకు కూడా అవకాశం లభించింది. కేబినెట్ లో 17మంది కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు.



 

సామాజిక వర్గాల వారీగా విభజన చూస్తే..

బీసీలు -8

కాపులు -4

కమ్మ -4

రెడ్డి -3

ఎస్సీ -2

ఎస్టీ -2

వైశ్య -1

మైనార్టీ -1

వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. మంత్రి పదవి ఖాయం అనుకున్న ఒకరిద్దరి పేర్లు జాబితాలో లేకపోవడం విశేషం. మరి అసంతృప్తులను బుజ్జగించేందుకు చంద్రబాబు ఎలాంటి కసరత్తులు చేస్తారో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News