సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు శనివారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
Advertisement
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరఫున న్యాయవాదులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇప్పటికే హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దర్యాప్తు తుది దశలో ఉన్న నేపథ్యంలో తాము ఈ కేసులో జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిన సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాదులు శనివారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విషయమై సోమవారం నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించి వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశమున్నట్టు సమాచారం.
∗
Advertisement