మంచివాళ్లను తీసుకుంటే తప్పేంటి..?

టీడీపీలో రైట్‌ మ్యాన్ రైట్ ప్లేస్‌లో ఉంటారని చెప్పారు. టీడీపీలో రైట్‌ మ్యాన్ ఉన్న చోట బయటి వారిని తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో మంచి వాళ్లు ఏ ఫీల్డ్‌లో ఉన్నా చేర్చుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు.

Advertisement
Update:2022-12-31 17:40 IST

ఒకరిద్దరు వైసీపీ నేతలు ఇటీవల అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో, అలాంటి వారంతా టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను తీసుకునే ప్రయత్నంలో ఉన్నామని అంగీకరించారు. వైసీపీలోని మంచివారు టీడీపీలోకి వస్తామంటే తీసుకోవ‌డంలో తప్పేంటని ప్రశ్నించారు.

టీడీపీలో రైట్‌ మ్యాన్ రైట్ ప్లేస్‌లో ఉంటారని చెప్పారు. టీడీపీలో రైట్‌ మ్యాన్ ఉన్న చోట బయటి వారిని తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో మంచి వాళ్లు ఏ ఫీల్డ్‌లో ఉన్నా చేర్చుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బాగుచేయాలన్న ఉద్దేశం ఉన్న మంచి వ్యక్తులను తీసుకుని కొన్నిచోట్ల వారికి సర్దుబాటులో చేయడంలో తప్పు లేదన్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల ఇతర పార్టీల నుంచి వలసలకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది. వైసీపీలో చేరినప్పటికీ అక్కడ సరైన ప్రాధాన్యత లేని వారిపై టీడీపీ ప్రధానంగా కన్నేసినట్టు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News