ప్రతీకారం తీర్చుకుంటాం.. - గెలిచాక ఆరునెల‌లు అదే పని.. అచ్చెన్న వ్యాఖ్యలు

అచ్చెన్న మాట్లాడుతూ.. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో జగన్ లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. టీడీపీని అంతం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని.. కానీ అది జరగని పని అని అచ్చెన్న అన్నారు.

Advertisement
Update:2023-04-18 15:18 IST

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, పవర్ లోకి వచ్చాక మొదటి ఆరునెలలు వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవడమే తమ పని అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం జగన్ ఆదేశాలతో పోలీసులు, అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని, వారెవ‌రినీ వదిలిపెట్టబోమన్నారు. అందరి పేర్లు నోట్ చేసుకుంటున్నామని, టీడీపీ అధికారంలోకి రాగానే వారి పని పడతామంటూ కామెంట్ చేశారు.

ఇవాళ కడప జిల్లాలో టీడీపీ కీలక సమావేశం జ‌రిగింది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందని ముఖ్యనేతలు ఈ మీటింగ్‌కు హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ.. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో జగన్ లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. టీడీపీని అంతం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని.. కానీ అది జరగని పని అని అచ్చెన్న అన్నారు. టీడీపీ గాలి పార్టీ కాదని.. ఎన్టీఆర్ స్థాపించిన స్ట్రాంగ్ పార్టీ అని అన్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అచ్చెన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే పలు సభల్లో చంద్రబాబు నాయుడు సైతం పోలీసులకు సూటిగా వార్నింగ్‌లు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే అందరి పని పడతామంటూ హెచ్చరించారు. తాజాగా అచ్చెన్న కూడా ఇటువంటి కామెంట్స్ చేయడం గమనార్హం. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కక్షంపు చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించే టీడీపీ.. తాము అధికారంలోకి వస్తే అదే పని చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబని సగటు జనం ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం టీడీపీ రాష్ట్రంలో జోష్ మీదుంది. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం.. మరోవైపు కేసులతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుండటంతో టీడీపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని చెప్పుకుంటోంది. వైసీపీ మాత్రం లబ్ధిదారుల ఓట్లనే ప్రధానంగా నమ్ముకున్నది. కాగా, విశాఖ ఎయిర్ పోర్టులో జ‌గ‌న్‌పై జరిగిన హ‌త్యాయ‌త్నం కేసు, వివేకా హత్య కేసు వైసీపీకి కళంకంగా మారాయి. ఈ రెండు ఘటనలను వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News