ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కి షాక్.. టీడీపీ అభ్యర్థి విజయం..

వాస్తవానికి టీడీపీ బలం 19. కానీ టీడీపీ అభ్యర్థి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేసినా.. మరో రెండు ఓట్లు అదనంగా వచ్చాయి.

Advertisement
Update:2023-03-23 19:16 IST

అనుకున్నంతా అయింది, తగినంత బలం లేకపోయినా టీడీపీ అభ్యర్థిని నిలబెట్టింది అంటూ కామెడీ చేసిన నోళ్లు ఇప్పుడు మూగబోయాయి. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. గెలుపుకి రావాల్సినదానికంటే ఒకఓటు ఎక్కువగా ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. ఎవరి ఆత్మ ఏంచెప్పిందో కానీ ఆత్మప్రభోదానుసారం ఓటు వేసి అనురాధను గెలిపించారు ఎమ్మెల్యేలు. దీంతో వైసీపీకి దెబ్బమీద దెబ్బపటినట్టయింది.

నిన్నటికి నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోయిన అధికార వైసీపీకి ఇది మరో పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. పట్టభద్రులు కేవలం ఒక చిన్న వర్గం మాత్రమే, వారికి మా పథకాలు కూడా అందడంలేదు అని చెప్పిన నేతలు, ఇప్పుడు ఎమ్మెల్యేల వర్గం ఎంత చిన్నదో చెప్పాల్సిన సమయం వచ్చింది. కచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారు. వాస్తవానికి టీడీపీ బలం 19. కానీ టీడీపీ అభ్యర్థి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేసినా.. మరో రెండు ఓట్లు అదనంగా వచ్చాయి. ఆ ఇద్దరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరో ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సునాయాస విజయం సాధిస్తామనుకుంది. సొంత బలం 151కి తోడు టీడీపీ, జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కలుపుకొని 156 ఓట్లు వైసీపీకి ఉన్నాయి. వాటిలో 154 ఓట్లు వస్తే ఆ పార్టీ నిలబెట్టిన ఏడుగురు అభ్యర్థులు గెలుస్తారు. కానీ టీడీపీ వ్యూహాత్మకంగా తన అభ్యర్థిని బరిలో నింపి జగన్ కి షాకిచ్చింది. పంచుమర్తి అనురాధ విజయంతో టీడీపీ ఆత్మవిశ్వాసం మరింత పెరిగినట్టయింది. వైసీపీలో అంతర్మథనం మొదలైంది. 

Tags:    
Advertisement

Similar News