వారిలో వైసీపీ రక్తం.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదన్నారు హోం మంత్రి అనిత.

Advertisement
Update:2024-06-17 12:43 IST

కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించారని, ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తం ప్రవహిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత. అలాంటి వారికి ఇంకా జగన్ పై ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని, వెళ్లి ఆ పార్టీకోసం పని చేసుకోవాలని చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదన్నారు హోం మంత్రి అనిత.

హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినరోజే అనిత వ్యాఖ్యలు కలకలం రేపాయి. గతంలో తాను డీజీపీ ఆఫీస్ కిి వచ్చినప్పుడు పలుమార్లు అవమానం జరిగిందని, ఇప్పుడు అదే డీజీపీ ఆఫీస్ లో తనను ప్రోటోకాల్ తో తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారామె. అనిత హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, గతంలో ఆమె ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీలో కొందరిని ఆమె టార్గెట్ చేసి మాట్లాడిన వీడియోలను టీడీపీ నేతలు షేర్ చేస్తున్నారు. వారందరికీ ఇప్పుడు మూడిందని హెచ్చరిస్తున్నారు.

ఏపీలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని చెప్పారు హోం మంత్రి అనిత. సింహాచలం అప్పన్నను దర్శించుకున్న ఆమె, అప్పన్న భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని చెప్పారు. పంచగ్రామాల భూ సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అయితే సాక్షాత్తూ హోంమంత్రే కొందరు పోలీస్ అధికారుల్ని టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడటం మాత్రం సంచలనంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News