శిల్పా రవికి నోటీసులిచ్చారా..? నంద్యాల ఎపిసోడ్ లో హైకోర్టు ట్విస్ట్..

నంద్యాల విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున, అక్కడికి మినహా అఖిల ప్రియ ఇంకెక్కడైనా వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులకు అండర్ టేకింగ్ ఇవ్వాలని అఖిలప్రియను ఆదేశించింది.

Advertisement
Update:2023-02-04 19:24 IST

నంద్యాలకు వెళ్లకుండా భూమా అఖిల ప్రియకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, ఆమెను హౌస్ అరెస్ట్ చేయడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు పోలీసులను ఆసక్తికర ప్రశ్నలు వేసింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు, ప్రభుత్వ న్యాయవాది తికమక పడ్డారు. చివరకు కోర్టు సీరియస్ కావడం ఈ ఎపిసోడ్ కి పెద్ద ట్విస్ట్.

నంద్యాల లో బహిరంగ చర్చకు సవాల్ విసిరారు భూమా అఖిల ప్రియ. అక్కడ గొడవ జరుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు ఆమెకు నోటీసులిచ్చారు. అంతవరకు బాగానే ఉంది, అయితే చర్చకు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి వస్తేనే కదా అక్కడ గొడవ జరిగేది, ఆయన రాకపోతే చర్చే ఉండదు కదా. పోనీ ఆయన వస్తాడనుకుంటే.. ఆయనకు కూడా నోటీసులిచ్చారా, హౌస్ అరెస్ట్ చేశారా, శిల్పా వర్గంలో ఎవరిమీదయినా నిఘా పెట్టారా, వారి కదలికలను గమనిస్తున్నారా.. అని కోర్టు ప్రశ్నించింది. శిల్పా రవికి నోటీసులివ్వలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పడంతో హైకోర్టు సీరియస్ అయింది. శిల్పా రవి రాకుండా డిబేట్ ఎలా జరుగుతుందని ప్రశ్నించింది.

అండర్ టేకింగ్ చాలు..

నంద్యాల విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున, అక్కడికి మినహా అఖిల ప్రియ ఇంకెక్కడైనా వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులకు అండర్ టేకింగ్ ఇవ్వాలని అఖిలప్రియను ఆదేశించింది. ఆమె అండర్ టేకింగ్ ఇచ్చిన వెంటనే పోలీసులు ఆమె ఇంటి వద్దనుంచి వెళ్లిపోవాలని కూడా స్పష్టం చేసింది. మొత్తమ్మీద భూమా అఖిల ప్రియ సవాళ్ల నేపథ్యంలో ఆమెను ముందుగానే అరెస్ట్ చేసి, నోటీసులిచ్చిన పోలీసులు.. అవతలి పార్టీ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. దీంతో కోర్టు వేసిన ప్రశ్నలకు పోలీసులు తడబడ్డారు. చివరకు అండర్ టేకింగ్ లెటర్ తీసుకుని అఖిలప్రియ ఇంటి వద్ద నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News