ఆ శాఖలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
వారి జీతం దీంతో రూ.21వేలు దాటింది. అలాగే ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించడానికి కూడా ప్రభుత్వం చొరవ చూపింది.
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబుబరు చెప్పింది. వారి జీతాలను 37 శాతం పెంచింది. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యుత్ శాఖలో పని చేస్తున్న 27 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలుగుతుంది. వారి జీతం దీంతో రూ.21వేలు దాటింది. అలాగే ఈ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించడానికి కూడా ప్రభుత్వం చొరవ చూపింది. వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించింది.
Advertisement