ఏపీపీఎస్సీ ఛైర్‌ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన అనురాధ

గ్రూప్‌-1, 2 సహా నిర్వహించాల్సిన పలు నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీసిన ఛైర్‌ పర్సన్‌

Advertisement
Update:2024-10-24 13:48 IST

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్‌ పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి ఎ. ఆర్‌. అనురాధ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందర్‌ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె. ప్రదీప్‌కుమార్‌.. అమెతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనురాధకు బోర్డు సభ్యులు, కార్యదర్శి, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

అనంతరం ఏపీపీఎస్సీలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో ఛైర్‌ పర్సన్‌ సమీక్షించారు. గ్రూప్‌-1, 2 సహా నిర్వహించాల్సిన పలు నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. పలు ఉద్యోగాల భర్తీ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, కొత్త నోటిఫికేషన్లు, ఇవ్వాల్సిన ఉద్యోగాల గురించి ప్రాథమికంగా చర్చించారు. వీటిపై వీలైనంత త్వరగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News